కరోనా పరిస్థితులు నెమ్మదిగా కుదుట పడుతుండడంతో వాయిదా పడిన సినిమాలన్నీ మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించగా తాజాగా అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు ఆ సినిమా మేకర్స్. 26/11 ఎటాక్ లో భారత దేశం కోసం ప్రాణాలు అర్పించిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా రూపొందుతోంది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబుకు చెందిన జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, A + S మూవీస్ సంస్థలు ఈ సినిమాని నిర్మించాయి.
Read Also : “మేజర్” రాకకు రూట్ క్లియర్
ఈ సినిమాను మార్చి 27వ తేదీన విడుదల చేస్తున్నామని తాజాగా మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేశారు. క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న అడవి శేష్ ఈ సినిమాతో కూడా హిట్ కొడతానని చాలా నమ్మకంగా ఉన్నారు. మరి చూడాలి అది ఎంతవరకు నిజం అవుతుందనేది. మొదటి పాట ‘హృదయమా’ సంగీత ప్రియుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను కలిగి ఉంది. అడివి శేష్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించగా, శోభితా ధూళిపాళ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.