కరోనా పరిస్థితులు నెమ్మదిగా కుదుట పడుతుండడంతో వాయిదా పడిన సినిమాలన్నీ మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించగా తాజాగా అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు ఆ సినిమా మేకర్స్. 26/11 ఎటాక్ లో భారత దేశం కోసం ప్రాణాలు అర్పించిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా రూపొందుతోంది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకి…