Site icon NTV Telugu

SSMB 29 : భయంకర అడవుల్లో రాజమౌళి, మహేశ్ షూట్.. నమ్రత రియాక్ట్

Ssmb 29

Ssmb 29

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29పై ఈ మధ్య అప్డేట్ రావట్లేదని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్స్ లో ఉన్నారు. మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. దీంతో వాళ్లంతా ప్రియాంక చోప్రా ఇన్ స్టాను ఫాలో అవుతున్నారు. ఆమె అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫొటో షేర్ చేస్తుంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొన్నటి వరకు ఒడిశాలో షూట్ చేసిన రాజమౌళి టీమ్.. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో షూట్ చేస్తున్నట్టు ప్రచారం అయితే జరిగింది. కానీ క్లారిటీ లేదు. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చేసింది ప్రియాంక చోప్రా. ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పైగా ఆ పోస్టుకు నమ్రత రియాక్ట్ కావడంతో ఈ ఫొటోలు ఎస్ ఎస్ ఎంబీ 29వే అని తేలిపోయింది.

Read Also : Ghaati : ఘాటీ సెన్సార్ రిపోర్టు.. అనుష్క నట విశ్వరూపమే..

ఈ ఫొటోలు అన్నీ ఉత్తర ఆఫ్రికాలోని అడవుల్లోవి అని తెలుస్తోంది. ఇంకొందరేమో అవి కెన్యా అడవులు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా ఒక్కతే ఇందులో కనిపిస్తోంది. అంతకు మించి ఇంకేవీ ఇందులో లేవు. కానీ ఆమె ఫొటోల లొకేషన్లు చూస్తుంటే మాత్రం అదంతా సెట్స్ దగ్గరవే అని తెలుస్తోంది. ఈ అడవుల్లో షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ దక్షిణాఫ్రికాలో షూట్ చేసినట్టు ఇప్పటి వరకు రాజమౌళి అధికారికంగా ప్రకటించలేదు. రాజమౌళి ఏదీ బయటకు చెప్పరనే విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ తో పాటు ప్రియాంక చోప్రా మీద సీన్లు షూట్ చేస్తున్నారంట.

Read Also : Chiranjeevi – Allu Arjun : పాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్

Exit mobile version