సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ చాలా యంగ్ గా కన్పిస్తారు. బాలీవుడ్ హీరోలా కనిపించే మన ప్రిన్స్ ఇప్పటికీ యంగ్ హీరోలందరికీ గట్టి పోటీ ఇస్తారు. ఆయన ఫిట్నెస్ రహస్యం ఏమై ఉంటుందా? అని ఇప్పటికీ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మహేష్ మాత్రం తన సీక్రెట్స్ ను ఎప్పుడూ బయట పెట్టలేదు. కానీ తాజాగా ఈ విషయాలన్నీ బయట పెట్టక తప్పలేదు మహేష్ కు. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” ఫైనల్ ఎపిసోడ్ లో మహేష్ బాబు పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ గ్రాండ్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ చాకచక్యంగా మహేష్ సీక్రెట్స్ అన్ని రాబట్టేశారు. అందులో మహేష్ ఫేవరెట్ ఫుడ్, సాంగ్స్, స్పోర్ట్స్ అన్నీ బయటపెట్టేశారు.
Read Also : నీలాంటి వారిని చూస్తే ఈర్ష్య… మహేష్ పై ఎన్టీఆర్ కామెంట్
డైట్ : సూపర్‌స్టార్ కృష్ణ గురించి మహేష్, ఎన్టీఆర్‌లు పెద్ద ఆహార ప్రియుడని చర్చించుకున్నారు. మహేష్ మాట్లాడుతూ “నాకు హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మా అమ్మమ్మ వండినది” అని అన్నారు. ఇంకా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పాడు.
స్పోర్ట్స్ : బాస్కెట్‌బాల్ చూడటం తనకు ఇష్టమని మహేష్ చెప్పాడు. ఇక తాను 12వ తరగతి వరకు క్రికెట్ ఆడేవాడినని అన్నాడు. వెంటనే ఎన్టీఆర్ అందుకుని త్వరలోనే ఒకరోజు మనం కలిసి క్రికెట్ ఆడదామని కోరాడు. దానికి మహేష్ కూడా అంగీకరించాడు. ఇంకా ఫుట్‌బాల్ లీగ్‌ల గురించి మాట్లాడుతూ తన కొడుకు గౌతమ్ తన స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ లీగ్‌లను చూస్తున్నాడని, ‘ “నేను ఇటీవలి ఫుట్‌బాల్ లీగ్‌ని చూశాను’ అని మహేష్ అన్నారు. అయితే ఎన్టీఆర్ తనకు ఆ క్రీడపై అవగాహన లేదని అంగీకరించాడు.
సాంగ్స్ : మహేష్ ని ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ గురించి అడగ్గా… తాను 4 ఏళ్ల వయసులో నటించడం ప్రారంభించానని “అవే కళ్లు” సినిమాలోని “మా ఊళ్ళో ఒక పడుచుంది” సాంగ్ ను గుర్తు చేసుకున్నారు. “ఒక్కడు” తన ఫేవరెట్ ఆడియో ఆల్బమ్ అని మహేష్ పేర్కొన్నాడు.