Heroine : సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారు.. తర్వాత కాలంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఎంతో మంది కెరీర్ లో సక్సెస్ అవుతున్నారు. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతిలో ఉన్న ఓ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అయింది. పైన ఫొటోలో మీకు కనిపిస్తున్న ఫొటో యువరాజు సినిమాలోనిది. మహేశ్ బాబు, సిమ్రాన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప.. ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు చేసింది. ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతోంది. వరుస సినిమాలు చేస్తూ సౌత్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఎవరో కాదు శ్రీ దివ్య. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా తమిళ్ లో అవార్డు గెలుచుకుంది.
Read Also : Chiranjeevi : నా కోడలిని చూస్తే గర్వంగా ఉంది.. చిరు ఎమోషనల్ ట్వీట్
ఆ ఈవెంట్ లో మహేశ్ బాబు తనను ఎత్తుకున్న ఫొటోను డిస్ ప్లే చేయగా.. దానిపై స్పందించింది. యువరాజు సినిమా సమయంలో తీసిన ఫొటో అని క్లారిటీ ఇచ్చింది. ఆ మూవీ సెట్స్ లో మహేశ్ ను తాను అన్నయ్య అని పిలిచే దాన్ని అంటూ చెప్పింది. చాక్లెట్ల కోసం అతని వెంట పడేదాన్ని అని ఓపెన్ అయింది. ఆ విషయాలు గుర్తుకు వస్తే ఇప్పుడు నవ్వొస్తుందని కామెంట్ చేసింది. మహేశ్ బాబును అన్నయ్య అని పిలవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ అప్పట్లో తెలియక అలా అన్నానని వివరించింది. శ్రీ దివ్య తెలుగులో మనసారా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కేరింత, బస్ స్టాప్ లాంటి సినిమాల్లో నటించింది. ఎక్కువగా తమిళ హీరోలతోనే సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది.
Read Also : WAR 2: ఎన్టీఆర్-హృతిక్ మధ్య ట్వీట్ వార్.. ఎందుకంటే..?
