NTV Telugu Site icon

Mahesh Babu: ఇప్పటివరకు నమ్రతకు నేను ఏది కొనివ్వలేదు.. ఎందుకంటే ..?

Mahesh

Mahesh

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక మహేష్ జీవితం చూస్తే.. ఆయనకు తెల్సినవి రెండే రెండు. ఒకటి సినిమా.. ఇంకొకటి కుటుంబం. వంశీ సినిమా టైమ్ లో నమ్రత శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.. గౌతమ్, సితార. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం లాగ .. ఎక్కడికి వెళ్లినా కూడా కుటుంబంతోనే వెళ్తాడు. ఒకపక్క సినిమాలు, ఇంకోపక్క యాడ్స్.. సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడపడం తప్ప వేరే యావగేషన్ లేదు మహేష్ కు. ఇక అతని వెనుక అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది నమ్రత. ఆయన బిజినెస్ వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటుంది. ఈ జంట ఫంక్షన్స్ కు, ఈవెంట్స్ కు జంటగా వచ్చినప్పుడు చూశాం కానీ, ఒక షోరూమ్ ఓపెనింగ్ లో మహేష్- నమ్రత జంటగా వచ్చారు. జూబిలీ హిల్స్​లోని తమ స్నేహితుల డిజైనర్ షాప్ ఓపెన్ చెయ్యడానికి ఇద్దరూ కలిసి కనిపించారు.

Venkatesh: చిన్నోడితో పోటీ.. పెద్దోడు ఏమన్నాడంటే.. ?

ఇక ఈ ఈవెంట్ లో మహేష్ కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. నమ్రతకు.. ఎప్పుడైనా మీరు ఏమైనా బట్టలు కొన్నారా.? అన్న ప్రశ్నకు మహేష్ మాట్లాడుతూ.. ” లేదు.. నేను ఇప్పటివరకు నమ్రతకు బట్టలు కొనలేదు.. ఏది కొనలేదు. ఎందుకంటే.. నాకు సెలక్షన్ అంతగా తెలియదు. ఇంకా చెప్పాలంటే.. నా బట్టలు కూడా నేను షాపింగ్ చేయను.. నమ్రతనే చేస్తుంది. ఇక ఈ షాప్ ఓపెనింగ్ కు నేను కేవలం ఫ్రెండ్ కోసమే వచ్చాను.. నా బ్రాండ్స్ లో ఇది లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.