బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేసిన రాజమౌళి… ట్రిపుల్ ఆర్‌తో ఇండియన్ సినిమాను ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఇక ‘బాహుబలి’ సిరీస్‌కు విదేశాల్లో చాలా అరుదైన గౌరవాలు దక్కాయి. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను 2019లో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు మరోసారి బాహుబలి సినిమాను నార్వేలోని మరో ప్రతిష్టాత్మక థియేటర్ స్టెవేంగర్ ఒపేరా హౌస్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ అక్కడకు వెళ్లారు. ఇక పనిలో పనిగా నార్వే దేశంలో గల పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. అయితే రాజమౌళి ఎప్పటి నుండో పల్ఫిట్ రాక్‌ని సందర్శించాలని అనుకుంటున్నారట. మగధీర సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడే ఈ పల్పిట్ రాక్ ఫొటోలు చూశాను కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఈ ప్రాంతాన్ని సందర్శించగలిగాను.. అని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు రాజమౌళి. అయితే రాజమౌళి ఎంజాయ్ చేస్తున్న ఆ ఫొటోలు చూసి అభిమానులు కాస్త భయపడుతున్నారు.
కొండ ఎడ్జ్‌లో కూర్చొని ఉండడంతో… జాగ్రత్త జక్కన్న, మరీ ఎత్తైన కొండల అంచున సాహసాలు చేయకని కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజమౌళి ఈ కొండలకు వెళ్లడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ మూవీ చేయబోతున్నాడు జక్కన్న. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోవైపు రాజమౌళి లొకేషన్స్ వేటలో ఉన్నాడనే సందేహాలు వస్తున్నాయి. అందులోభాగంగానే.. ఇప్పుడు నార్వేలోని పల్పిట్ రాక్స్‌ను సందర్శించాడని అంటున్నారు. ఇప్పటికే SSMB29ని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పేశాడు జక్కన్న. అందుకే.. పనిలో పనిగా లొకేషన్స్ వేట కూడా పూర్తి చేస్తున్నాడని అంటున్నారు. మరి జక్కన్న ఎస్ఎస్ఎంబీ 29ని ఎక్కడెక్కడ షూట్ చేస్తాడో చూడాలి.