Site icon NTV Telugu

SSMB 29 : పాసులుంటేనే రండి.. మహేశ్ బాబు స్పెషల్ రిక్వెస్ట్

Mahesh Babu

Mahesh Babu

SSMB 29 : రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. రేపు నవంబర్ 15 శనివారం రోజున సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈవెంట్ గురించి రాజమౌళి వీడియో చేసి వివరాలు చెప్పాడు. తాజాగా మహేశ్ బాబు కూడా స్పెషల్ గా ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఈవెంట్ కు ఫిజికల్ పాసులు ఉన్న వాళ్లు మాత్రమే రావాలని కోరాడు. రేపు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంటుందని.. పాస్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గూగుల్ మ్యాప్ వస్తుందని.. దాని ప్రకారం బ్యాక్ సైడ్ రావాలన్నాడు.

Read Also : Malaika Arora : పెళ్లికి ముందే కాబోయే వాడితో డేట్ చేయాలి.. నటి షాకింగ్ కామెంట్స్

పోలీసులు స్ట్రిక్ట్ గా కండీషన్స్ పెట్టారని.. తక్కువ ట్రాన్స్ పోర్టేషన్ లో వస్తేనే ఇంకా బెటర్ అంటూ తెలిపాడు మహేశ్. మనకు ఇంకా చాలా ఈవెంట్లు జరుగుతాయని.. సేఫ్టీగా వచ్చి వెళ్లడం ఇంపార్టెంట్ కాబట్టి.. అందరూ జాగ్రత్తగా రావాలని.. రేపు ఈవెంట్ లో కలుద్దాం అంటూ కోరాడు మహేశ్ బాబు. ఆయన చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమా ఈవెంట్ కోసం ఇప్పటికే చాలా మందికి పాస్ పోర్టు లాంటి ఫిజికల్ పాసులను జారీ చేశారు. చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేయించారు. రేపు సినిమా మహేశ్ బాబు లుక్, టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేస్తారు.

Read Also : Shiva Re Release : యంగ్ హీరోలపై నాగార్జున ప్రభావం ఉంటుంది.. మంత్రి కోమటిరెడ్డి ట్వీట్

Exit mobile version