సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. 2024 సంక్రాంతికి SSMB 28 సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో మహేశ్ బాబు స్టైల్ అండ్ స్వాగ్ తో స్మోక్ చేస్తూ నడుస్తూ కనిపించాడు. పర్ఫెక్ట్ మాస్ బొమ్మతో మహేశ్ వస్తున్నాడు అనే ఫీలింగ్ ఒక్క పోస్టర్ తోనే ఇవ్వడంలో త్రివిక్రమ్ సక్సస్ అయ్యాడు. ఈ పోస్టర్ లో మహేశ్ బాబు డ్రెస్సింగ్ స్టైల్, బ్యాక్ గ్రౌండ్, వాకింగ్ స్టైల్ లాంటి ఎలిమెంట్స్ కన్నా ఘట్టమనేని అభిమానులని ఎక్కువగా అట్రాక్ట్ చేసింది మహేశ్ బాబు చేతిలో ఉన్న బీడీ. మహేశ్ బాబు స్మోకింగ్ స్టైల్ కి ఘట్టమనేని అభిమానుల్లో సెపరేట్ క్రేజ్ ఉంది. అతడు, పోకిరి, అతిథి, ఒక్కడు లాంటి సినిమాల్లో మహేశ్ బాబు స్మోక్ చేస్తూ కనిపించాడు.
ముఖ్యంగా మహేశ్ ని స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్ గా మార్చిన ఒక్కడు సినిమాలో మహేశ్ బాబు స్మోకింగ్ స్టైల్ ని అప్పటి యూత్ అంతా ఫాలో అయ్యారు. స్మోకింగ్ స్టైల్ ఒక ఆర్ట్ అయితే మహేశ్ బాబు దానికి పికాసో లాంటి వాడు అని మహేశ్ ఫాన్స్ చెప్పుకుంటూ ఉంటారు. అంతటి స్వాగ్ ని మైంటైన్ చేసే మహేశ్ బాబు, సితార పుట్టిన తర్వాత స్మోకింగ్ ని వదిలేసాడు. తను సినిమాల్లో స్టైల్ కోసం కాలిస్తే అభిమానులు దాన్ని రియల్ లైఫ్ లో ఫాలో అవుతూ హెల్త్ పాడు చేసుకుంటున్నారని మహేశ్ బాబు సినిమాల్లో కూడా స్మోక్ చెయ్యడం ఆపేసాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మహేశ్ బాబుతో ఆన్ స్క్రీన్ స్మోక్ చేయించాడు త్రివిక్రమ్. మరి 2024 సంక్రాంతికి వింటేజ్ మహేశ్ బాబుని చూసి ఘట్టమనేని అభిమానులు ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.