Sankranthi Movies: ఎవరి టైం ఎంత? వర్కౌట్ అయ్యేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈసారి సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి నాలుగు సినిమాలు దూసుకొస్తున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వరుసగా థియేటర్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలు… అన్ని కూడా యు/ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాల రన్ టైం కూడా రివీల్ అయిపోయాయి. జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా 159 నిమిషాలు… అంటే రెండు గంటల 39 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది. అదే రోజు రిలీజ్ కానున్న హనుమాన్ కూడా ఇంచు మించు ఇదే రన్ టైంతో రిలీజ్ అవుతోంది. రెండు గంటల 38 నిమిషాల నిడివితో రానుంది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు.
ఇక వెంకీ మామ సైంధవ్ విషయానికి వస్తే… రెండు గంటల 20 నిమిషాల రన్ టైంతో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఫైనల్‌గా జనవరి 14న రిలీజ్ కానున్న నాగార్జున నా సామిరంగ… రెండు గంటల 26 నిమిషాల రన్ టైం లాక్ చేసుకుంది. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఈ నాలుగు సినిమాల రన్ టైం చూస్తే… గుంటూరు కారం రన్ టైం ఎక్కువగా ఉంది. వెంకీ సైంధవ్ తక్కువ నిడివితో రాబోతోంది. ఈ సినిమాలన్నీ కూడా పర్ఫెక్ట్ రన్ టైంతోనే వస్తున్నాయి కాబట్టి… ఆడియెన్స్ సినిమా లెంగ్తీగా ఉందని ఫీల్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే… గుంటూరు కారం 125 కోట్లు… హనుమాన్, సైంధవ్ 25 కోట్లు… నాగార్జున నా సామిరంగ 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాయి.
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!