Mahesh Babu – Allu Arjun : సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. కానీ ఆయన వదులుకున్న కథలు కూడా వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు తెచ్చిపెట్టాయి. అలా మహేశ్ బాబు వదులుకున్న కథల్లో ఒకటి అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదేదో కాదు.. రేసు గుర్రం మూవీ. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి.. ముందుగా సూపర్ స్టార్ మహేశ్ బాబును దృష్టిలో పెట్టుకుని స్టైలిష్ గా హీరో పాత్రను డిజైన్ చేశారంట. కానీ అప్పుడున్న బిజీ షెడ్యూల్ లో మహేశ్ బాబు ఈ సినిమాకు టైమ్ కావాలని అడిగారంట. మహేశ్ బాబు బిజీ షెడ్యూల్ ను గమనించిన సురేందర్ రెడ్డి.. అదే కథను బన్నీకి వినిపించాడు.
Read Also : Ilaiyaraaja : చుక్కలు చూపిస్తున్న ఇళయరాజా.. మరీ ఇంత అవసరమా..?
మంచి మాస్ కథ కోసం వెయిట్ చేస్తున్న బన్నీకి రేసుగుర్రం బాగా నచ్చింది. వెంటనే పట్టాలెక్కించారు. యాక్షన్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్ ఇందులో బాగా పండాయి. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ మొదటిసారి రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. స్టార్ హీరోల రేసులో దూసుకుపోయాడు. ఒకవేళ ఆ సినిమా మహేశ్ బాబు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ ఆ పాత్ర అల్లు అర్జున్ కు పర్ ఫెక్ట్ గా సూట్ అయింది. అందుకే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో మద్దాలి శివారెడ్డి పాత్ర బాగా పాపులర్ అయింది. అలాగే హీరోయిన్ శృతిహాసన్ కు ఈ సినిమాతో మంచి హిట్ పడి వరుస ఛాన్సులు వచ్చాయి.
Read Also : Mahesh Babu : ఆ సంచలన డైరెక్టర్ తో మహేశ్ బాబు మూవీ..?
