Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల మీదనే మహేష్ ఫోకస్ పెట్టాడు. ఇక మొదటి నుంచి కూడా మహేష్.. తన సినిమాల విషయంలో, కథల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఎందుకంటే తనకు సెట్ కానీ పాత్రలను అస్సలు ఒప్పుకోడు. ఇప్పటివరకు మహేష్ ఎన్ని హిట్ సినిమాలు వదులుకున్నాడో చాలామందికి తెలుసు. ఇక పుష్ప సినిమాను మొదట మహేష్ బాబు వద్దకు వచ్చింది. కానీ, ఆ రగ్గడ్ లుక్ హ్యాండిల్ చేయలేక మహేష్ నో చెప్పాడు. ఇదొక్క సినిమానే కాదు.. గజినీ, గ్యాంగ్ లీడర్, ఫిదా, రుద్రమదేవి, లీడర్ లాంటి సినిమాలు వదులుకున్నాడు. ఇక తాజాగా మరో సినిమాను మహేష్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. యానిమల్ సినిమాను రిజెక్ట్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Allu Arjun: పవన్ డైరెక్టర్ తో బన్నీ బాలీవుడ్ సినిమా.. అంత లేదమ్మా.. ఇది మ్యాటర్
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా తన తదుపరి సినిమా రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా అనౌన్స్ చేశాడు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి యానిమల్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక యానిమల్ నుంచి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తుంటే.. అసలు సినిమా అంటే ఇలా ఉండాలి. ఆ రక్తం.. యాక్షన్.. వేరే లెవెల్ ఉండబోతుంది అని అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక మచ్చుకు సినిమా ఎలా ఉండబోతుందో టీజర్ ద్వారా చుపించాడు. ఒక సాధారణ యువకుడు ఒక యానిమల్ లా ఎలా మారాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమా మొదట మహెహ్స్ దగ్గరకు వెళ్లిందట. ఒకవేళ ఈ సినిమాను కనుక మహేష్ ఓకే చేసి ఉంటే.. ఇంత రక్తపాతాన్నీ మహేష్ హ్యాండిల్ చేసేవాడా.. ? అంత యాక్షన్ డ్రామాను మహేష్ న్యాయం చేసేవాడా.. ? అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకే మొదటనుంచి కూడా తనకు సూట్ అయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు మహేష్. ఈ విషయంలో మహేష్ పర్ఫెక్ట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.