సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 13 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఘట్టమనేని అభిమానులకి పూనకాలు తెస్తుంది. జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ బయటకి ఇంకా పూర్తిగా రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం డివైడ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు లేకుంటే గుంటూరు కారం సినిమా ఈ పాటికి విపరీతమైన నెగటివ్ టాక్ సొంతం చేసుకునేదేమో అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహేష్ వన్ మ్యాన్ షో చేసిన గుంటూరు కారం సినిమా కథనం విషయంలో గురూజీ కాస్త జాగ్రత్తలు తీసుకోని ఉంటే బాగుండేది అనే టాక్ వస్తుంది. హాఫ్ బేక్డ్ ప్రాడక్ట్ గా ఉంది గుంటూరు కారం అని సింపుల్ గా చెప్పేస్తున్నారు క్రిటిక్స్.
మహేష్ సినిమాలకి ఈ మధ్య ఇలాంటి టాక్ సర్వసాధారణం అయిపొయింది. ఏ సినిమా వచ్చిన పాయింట్ బాగుంది కానీ హాఫ్ బేక్డ్ గా ఉంది, ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండు అనే మాట ఏళ్ల తరబడి వినిపిస్తూనే ఉంది కానీ టాక్ తో సంబంధం లేకుండా క్రిటిక్స్ ఇచ్చే రివ్యూస్ ని లెక్క చేయకుండా మహేష్ సినిమాలు కలెక్షన్స్ తెస్తున్నాయి. మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట లాంటి సినిమాలు యావరేజ్ రివ్యూస్ నే అందుకున్నాయి. ఈ సినిమాలకి డే 1 టాక్ చాలా బ్యాడ్ వచ్చింది. ఆ టాక్ ని దాటి ఈ సినిమాలు కలెక్షన్స్ ని తెచ్చాయి. సినిమాల టాక్ యావరేజ్ ఏమో కానీ కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గా కాకుండా అదిరిపోయేలా వచ్చాయి. అందుకే మహేష్ బాబు సినిమాలు క్రిటిక్ ప్రూఫ్ అనే పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు కూడా గుంటూరు కారం సినిమాకి యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది కానీ కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గా ఉండే అవకాశమే లేదు. ఓపెనింగ్స్ విషయంలో మహేష్ కొత్త బెంచ్ మార్క్స్ ని సెట్ చేయడం గ్యారెంటీ.