మెసేజులు ఇచ్చే మహేష్ బాబుని చూసి అలసిపోయిన ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి గుంటూరు కారం సినిమా రాబోతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపిస్తూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. జనవరి 12న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి రానున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ ఈరోజు బయటకి రానుంది. గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు ట్రైలర్ రిలీజ్ తో మరింత పెరగనున్నాయి. ట్రైలర్ బయటకి రావడానికి కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని సీజ్ చేసి తమ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు. మహేష్ మూవీస్ లోని మాస్ సీన్స్ ని, డైలాగ్స్ ని, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని, గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో గుంటూరు కారం ట్యాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు.
మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టిన ఫోటోలు, బీడీ తాగుతున్న పాత సినిమాల ఫోటోలని కూడా మహేష్ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. మహేష్… పోకిరి, శ్రీమంతుడు సినిమాలో హెడ్ కి బ్యాండ్ కట్టాడు. ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అలానే మహేష్ బాబు స్మోకింగ్ స్టైల్ కి ఘట్టమనేని అభిమానుల్లో సెపరేట్ క్రేజ్ ఉంది. అతడు, పోకిరి, అతిథి, ఒక్కడు లాంటి సినిమాల్లో మహేష్ బాబు స్మోక్ చేస్తూ కనిపించాడు. ముఖ్యంగా మహేష్ ని స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్ గా మార్చిన ఒక్కడు సినిమాలో మహేష్ బాబు స్మోకింగ్ స్టైల్ ని అప్పటి యూత్ అంతా ఫాలో అయ్యారు. అంతటి స్వాగ్ ని మైంటైన్ చేసే మహేష్ బాబుతో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆన్ స్క్రీన్ స్మోక్ చేయించాడు త్రివిక్రమ్. మరి సంక్రాంతికి వింటేజ్ మహేష్ బాబుని చూసి ఘట్టమనేని అభిమానులు ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.