సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలను, వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచాలనుకుంటారు. అయితే తాజాగా మహేష్ పిల్లల విషయంలో ఓపెన్ అయ్యారు. అంతేకాదు నెలలు నిండకుండానే గౌతమ్ పుట్టడం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. “అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె” చివరి ఎపిసోడ్‌లో మహేష్ తన కొడుకు గౌతమ్ పుట్టుకను గుర్తు చేసుకున్నాడు.
Read Also : విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ !
మహేష్ బాబు మాట్లాడుతూ “గౌతమ్ ఆరు వారాల ముందు నెలలు నిండని శిశువుగా జన్మించాడు. నేను మొదట గౌతమ్ ను ఎత్తుకున్నప్పుడు అతను నా చెయ్యంత ఉన్నాడు. ఇప్పుడు గౌతమ్ దాదాపు 6 అడుగుల పొడవు ఉన్నాడు. మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి గౌతమ్ ను జాగ్రత్తగా చూసుకోగలిగాము. అంటే మాకు డబ్బు ఉంది కాబట్టి ఓకే… మరి లేని వారి సంగతేంటి ? పిల్లల కోసం ఎప్పటి నుంచో ఏదో ఒకటి చేయాలనే కోరిక.. అలా పుట్టిందే పిల్లల కోసం ఇప్పుడు చేస్తున్న పని” అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ పూర్తి ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ఆహలో ప్రసారం అవుతుంది.
కాగా మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 2005 లో వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారలతో మహేష్, నమ్రతాలది అద్భుతమైన ఫ్యామిలీ. 2006 ఆగష్టు 31న గౌతమ్ జన్మించాడు. గౌతమ్ ప్రీ మెచ్యూర్ బర్త్ పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలకు హెల్ప్ చేయడానికి తనను ప్రేరేపించిందని మహేష్ బాబు తెలిపారు. 1000 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్రచికిత్సలను చేయించారు మహేష్ బాబు.
