NTV Telugu Site icon

Mahesh Fans on Fire: దర్శకుడు వంశీ పైడిపల్లిపై మహేష్ ఫ్యాన్స్ అలక

Mahesh Babu

Mahesh Babu

Mahesh Fans on Fire: మహేష్ బాబు అభిమానులు దర్శకుడు వంశీ పైడిపల్లిపై ఫైర్ అవుతున్నారు. విజయ్ సినిమా ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’)లో రెండో సింగిల్ సాంగ్ విడుదల అందుకు కారణం అయింది. 2019లో మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిట్ అయి జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే అది తమ అభిమాన హీరో కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమా కావటంలో టైటిల్స్‌లో స్పెషల్ ప్రజెంటేషన్ ఉంటుందని భావించారు. అయితే వంశీ పైడిపల్లి మహేష్ టైటిల్ కార్డ్ కోసం ఎలాంటి స్పెషల్ ప్లానింగ్ లేకుండా సింపుల్‌గా రిలీజ్ చేసి అభిమానులను నిరాశకు గురిచేశాడు.

Read Also: Akshay Kumar: ఛత్రపతి శివాజీగా మారిన బాలీవుడ్ ఖిలాడీ

కానీ ఇప్పుడు విజయ్‌ 30 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వారిసు’ చిత్రంలో సెకండ్ సాంగ్ ‘తీ దలపతి’ అనే టైటిల్‌తో శింబుతో పాడించి షూట్ చేసి విడుదల చేశారు. విజయ్ అభిమానులు ఈ పాటతో పుల్ ఖుషీ అయిపోతున్నారు. పాట కూడా పుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇదే ఇప్పుడు మహేష్ అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోందట. వంశీ పైడిపల్లి విజయ్‌కి ఇచ్చిన ప్రాముఖ్యత మహేష్‌కు ఇవ్వలేదని వంశీ పైడిపల్లిపై అలక వహించి ఫైర్ అవుతున్నారు. మరి వారి అలకను వంశీ ఎలా తీరుస్తాడో చూడాలి.

Show comments