Sarkaru Vaari Paata: వేదికపై స్టెప్పులేసిన మహేశ్.. దద్దరిల్లిన ప్రాంగణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈవెంట్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలావరకు సెటిల్డ్‌గానే ఉంటారు. వస్తారు, అభిమానుల్లో జోష్ నింపే ప్రసంగం ఇస్తారు, వెళ్ళిపోతారు.. అంతే తప్ప స్టెప్పులేసిన దాఖలాలు లేవు. అలాంటి మహేశ్.. తొలిసారి కర్నూలులో జరిగిన ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌లో మీట్లో వేదికపై స్టెప్పులేశారు. తొలుత తమన్ వేదికపైకి వెళ్ళి డ్యాన్సర్లతో స్టెప్పులు కలపగా, ఆ వెంటనే మహేశ్ స్వయంగా వేదికెక్కి తన ‘మ మ మహేశ్’ పాటకి ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేశారు. దీంతో, ఆ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. తమ అభిమాన హీరో లైవ్‌లో స్టెప్పులేయడాన్ని చూసి, ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు.
అంతేకాదు.. తానిలా స్టెప్పులు వేయడానికి గల కారణమేంటో కూడా మహేశ్ వివరించారు. అప్పుడెప్పుడో ‘ఒక్కడు’ షూటింగ్ కోసం తాను కర్నూలుకి వచ్చానని, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ‘సర్కారు వారి పాట’ సక్సెస్ మీట్ కోసం ఇక్కడికి వచ్చానన్నారు. తన కోసం ఇంతమంది అభిమానులు తరలి వస్తారని తాను ఊహించలేదని, ఆ ఆనందంతోనే మీ (ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ) కోసం తొలిసారి స్టెప్పులు వేశానని మహేశ్ చెప్పారు. తనకోసం వచ్చినందుకు థాంక్యూ చెప్పిన మహేశ్.. మీ అభిమానం, ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఇదేదో సక్సెస్ మీట్‌లా లేదని, వంద రోజుల ఫంక్షన్‌లా అనిపిస్తోందని.. ఫంక్షన్లంటూ చేస్తే రాయలసీమలోనే చేయాలన్నట్టుగా ఉందని మహేశ్ చెప్పుకొచ్చారు.
Also Read
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
తాజావార్తలు
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!