Mahesh Babu Congratulates Pawan kalyan Chandrabau: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు సినీ రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సోషల్ మీడియా వేదికగా ఇరువురికి శుభాకాంక్షలు చెబుతూ ఉండగా ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఈ ఇద్దరికీ శుభాభినందనలు తెలిపారు.
Puvvada Ajay Kumar : కాంగ్రెస్ గూండాలు దాడి చేసి హత్య చేశారు
ముందుగా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక కంగ్రాట్స్ చెబుతూ ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలిచినందుకు తాను చాలా ఆనందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈసారి ఐదేళ్లు ఏపీ అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ మీ చిరస్థాయిలో నిలిచిపోయే గెలుపుకి కంగ్రాట్స్ ప్రజలు మీ మీద ఉంచిన నమ్మకానికి ఈ గెలుపు ఒక భారీ సూచనగా కనిపిస్తోంది ఈ ఐదేళ్లు అద్భుతంగా ప్రజల కోసం పనిచేస్తూ మన ప్రజల కలలు తీర్చాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సహా టాలీవుడ్ లో యువ హీరోలు చాలామంది నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.