Site icon NTV Telugu

Tollywood Rewind 2023: ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించని తెలుగు హీరోలు వీరే!

Ram Charan Ntr Mahesh

Ram Charan Ntr Mahesh

Mahesh Babu, Allu Arjun, NTR, and Ram Charan Missed 2023: ఎట్టకేలకు 2023 చివరికి వచ్చేశాం. అయితే ఈ ఏడాది చాలా మంది తెలుగు హీరోలు ఒక్క సినిమాతో కూడా తమ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను పలకరించలేక పోయారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఈ ఏడాది వారివి ఒక్క సినిమా కూడా విడుదల కాకపోవడం విడ్డూరం. ఇక ఈ టాప్ నలుగురు హీరోలు 2023 సంవత్సరాన్ని పూర్తిగా వేస్ట్ చేసుకున్నారు.

మహేష్ బాబు- గుంటూరు కారం 2023 నుంచి 2024కి మారింది
ఈ ఏడాది ఆగస్ట్‌లో “గుంటూరు కారం” విడుదల చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేశారు. అయితే అనేక కారణాలతో సినిమా ప్రొడక్షన్ రెండుసార్లు వాయిదా పడింది. విడుదల తేదీని జనవరి 12, 2024కి వెనక్కి మార్చడంతో మహేష్ బాబు 2023 సంవత్సరాన్ని మిస్ అయ్యారు.

RRR స్టార్ల షూటింగ్‌లు ఆలస్యం అయ్యాయి
“RRR” సినిమాతో ప్రపంచ ఖ్యాతిని సంపాదించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్కార్ ప్రచారంలో పాల్గొన్నారు. దెబ్బతో వారి షూట్ ప్లానింగ్స్ అన్నీ వెనక్కి నెట్టబడ్డాయి. ఎన్టీఆర్ “దేవర” ప్రస్తుతం నిర్మాణంలో ఉంది , ఏప్రిల్ 2024 లో థియేటర్లలో విడుదల అవుతుంది. మరోవైపు శంకర్ గత రెండు సంవత్సరాలుగా “గేమ్ ఛేంజర్” సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల పాటు చిత్రీకరణ జరగనుంది. ఫలితంగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 2024 ద్వితీయార్థంలో విడుదల కానుంది.

Tollywood Heros : బుల్లితెరపై కూడా హవాను కొనసాగిస్తున్న స్టార్ హీరోలు..

అల్లు అర్జున్ కూడా ఈ సంవత్సరం మిస్ అయ్యాడు
అల్లు అర్జున్ -దర్శకుడు సుకుమార్ “పుష్ప 2” ను 2023లో విడుదల చేయాలనే తమ ప్రణాళికలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మొదటి భాగం భారతదేశంలో భారీ విజయాన్ని సాధించగా సీక్వెల్ ఇంకా పెద్దదిగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఫలితంగా, విడుదల తేదీ ఆగష్టు 2024కి వాయిదా పడింది. అందుకే, అల్లు అర్జున్‌కి ఈ సంవత్సరం ఒక్క రిలీజ్ కూడా లేదు.

శర్వానంద్
శర్వానంద్, నాగార్జున అక్కినేని, వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి వంటి ఇతర హీరోలు కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయారు. శర్వానంద్ గత సంవత్సరం “ఒకే ఒక జీవితం”తో విజయాన్ని అందుకున్నాడు, ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 35వ సినిమాని ప్రారంభించాడు. అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇవన్నీ 2023లో ఆయన సినిమా విడుదల కాకపోవడానికి కారణమయ్యాయి.

వెంకటేష్
వెంకటేష్ ఈ సంవత్సరం తన మొదటి వెబ్ సిరీస్ “రానా నాయుడు”లో కనిపించినప్పటికీ, 2023లో ఆయన సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన “సైంధవ్” జనవరి 13, 2024కి వాయిదా పడింది. ఇక ఆయన మేనల్లుడు రానా కూడా ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు.

నాగార్జున
వరుస ఫ్లాపుల తర్వాత, నాగార్జున మూడు నెలల క్రితం “నా సామి రంగ” సినిమా ప్రారంభించడానికి చాలా బ్రేక్ తీసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఆయన నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక ఇప్పుడు టెలివిజన్‌లో “బిగ్ బాస్ తెలుగు” హోస్ట్‌గా అయితే కొనసాగుతున్నాడు.

Exit mobile version