Site icon NTV Telugu

Mahavatar Narsimha : ఓటీటీలోకి మహావతార్ నరసింహా.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?

Mahavatar

Mahavatar

Mahavatar Narsimha : యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తీసిన ఈ మూవీ.. రికార్డులను తిరగరాసింది. నరసింహుడి ఉగ్రరూపం యానిమేషన్ రూపంలో చూసిన ప్రేక్షకులు తరించిపోయారు. థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 19 న అంటే రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Also : Bigg Boss 9 : ఏంటీ పిచ్చి పని.. సుమన్ శెట్టిని లాగి పడేసిన డిమాన్ పవన్..

దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా.. తొలి 8 రోజుల్లోనే రూ.60 కోట్ల దాకా వసూలు చేసింది. లాంగ్ టైమ్ లో రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయాన్ని నమోదు చేసింది. థియేటర్లకు ప్రేక్షకులు చెప్పులు వేసుకోకుండా వెళ్లారంటే.. ఈ మూవీ ఏ స్థాయిలో విజృంభన సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలని అంటున్నారు మూవీ అభిమానులు. ఇండియాలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన యానిమేషన్ మూవీ కూడా ఇదే.

Read Also : Kalki-2 : దీపిక ప్లేస్ లో సూట్ అయ్యేది ఆ ఇద్దరేనా..?

Exit mobile version