పదండి ముందుకు… శ్రీశ్రీ ప్రపంచం పిలిచింది…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఈ యుగం నాది’ అని శ్రీశ్రీ చెప్పడంలో కొందరికి ఆనాడు అతిశయోక్తిగా అనిపించి ఉండొచ్చు. కానీ ఈ నాటికీ ఏ సందర్భంలోనైనా మహాకవి శ్రీశ్రీని, ఆయన కవితలను తలచుకోకుండా ఉండలేం!ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా దానికి శ్రీ శ్రీ గీతానికి అన్వయిస్తూ ఆలోచించడం రెండు మూడు తరాలకు అలవాటుగా మారిపోయింది. భవిష్యత్ లోనూ అదే సాగుతుంది.
1910లో విశాఖ పట్నంలో సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శ్రీరంగం శ్రీనివాసరావుకు పదిహేనేళ్ళ వయసులోనే వెంకట రమణమ్మతో వివాహం జరిగింది. ఆ తర్వాతే ఆయన 1931లో బి.ఎస్.సి., జువాలజీ చేశారు. ఆంధ్ర ప్రభలోనూ ఉద్యోగం చేసిన శ్రీశ్రీ 1933 -40 మధ్య కాలంలో రాసిన ‘మహా ప్రస్థానం’ గీతాలు ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. చిత్రసీమలోకి కాస్తంత ఆలస్యంగానే అడుగుపెట్టినా… అక్కడా తనదైన శైలిలో అగ్నిజ్వాలలు కురిపించారు శ్రీశ్రీ. హిందీ చిత్రం ‘నీరా ఔర్ నందా’ తెలుగు అనువాదం ‘ఆహుతి’తో ఆయన సినీరంగంలోకి గీత రచయితగా అడుగుపెట్టారు. విశేషం ఏమంటే తెలుగులో అదే తొలి అనువాద చిత్రం కూడా!
Also Read
పద్య, గద్య రచనలోనూ విశేష అనుభవం ఉన్న శ్రీశ్రీ తన వ్యక్తిగత అభిరుచులను పక్కన పెట్టి, దర్శక నిర్మాతలు కోరినది అందించారు. అందుకే కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటగా భాసిల్లారు. అదే సమయంలో అభ్యుదయ భావాలు పలికించాల్సిన సందర్భంలోనూ, సమ సమాజ నిర్మాణ ఆవశ్యకతను తెలియచేయాల్సి వచ్చినప్పుడు శ్రీశ్రీ కలం మరింత ఉత్సాహంగా కదను తొక్కింది. నాణానికి మరో వైపు అన్నట్టుగా ప్రేమ భావనను, మానవీయ విలువలను సినిమా మాధ్యమం ద్వారా అశేష ప్రజానీకం ముందు అంతే ఆర్ద్రతతో ఆవిష్కరించారు శ్రీశ్రీ. ‘ఆరాధన’లోని ‘నా హృదయంలో నిదురించే చెలి’ గీతానికి, ‘దేవత’లోని ‘బొమ్మను చేసి ప్రాణము పోసి’ పాటకు, ‘వెలుగు నీడలు’ లోని ‘కలకానిది వెలువైనది’, ‘నర్తనశాల’లోని ‘ఎవ్వరి కోసం ఈ మందహాసం..’ పాటకు పొంతనే ఉండదు. కానీ ఆ యా సందర్భాలను బట్టి అద్భుతమైన భావాలను శ్రీశ్రీ వ్యక్తం చేశారు. నిజానికి శ్రీ శ్రీ కమ్యూనిస్టు. దేవుడంటే ఆయనకు విశ్వాసం లేదు. అయినా… పలు భక్తిగీతాలు రాశారు. అదే సమయంలో ‘దేవుడు చేసిన మనుషుల్లారా… మనుషులు చేసిన దేవుళ్ళారా’ అంటూ ఆ వింత గోలను, దేవుడి లీలను చూడమంటూ ప్రజలను చైతన్య పరిచారు.
శ్రీశ్రీ విడిగా రాసిన గీతాలను సినిమాలలో వివిధ సందర్భాలలో వాడుకున్న సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో… ‘ఆకలిరాజ్యం’ చిత్రంలో కమల్ హాసన్ పాడేవన్నీ శ్రీశ్రీ గీతాలే. ఇక చిరంజీవి ‘రుద్రవేణ’లోనూ నేను సైతం అంటూ శ్రీశ్రీ గీతాన్నే ఆవిష్కరించారు బాలచందర్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి గానూ శ్రీశ్రీ రాసిన ‘తెలుగువీర లేవరా’ జాతీయ స్థాయిలో తొలి తెలుగు ఉత్తమ గీతంగా ఎంపిక కావడం మరో ఎత్తు. చిత్రం ఏమంటే… శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిథ నొక్కటి ధారవోశాను’ పదాలనే తీసుకుని ‘ఠాగూర్’ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ రాసిన గీతానికీ జాతీయ అవార్డు లభించింది. ఆ రకంగా శ్రీశ్రీ తదనంతర కాలంలోనూ తెలుగు సినిమా పాటతో మమేకమయ్యారని మరోసారి నిరూపితమైంది. ఇక విప్లవ చిత్రాలకు, అందులోని గీతాలకు శ్రీశ్రీ కలం దన్నుగా నిలిచి వాటిని విజయపథంలో నడిపించింది. తెలుగు సినిమా ప్రస్థానంలో ఆయనదో ప్రత్యేక అధ్యాయం. కేవలం సినీ గీత రచయితగానే కాకుండా శ్రీశ్రీ తెలుగు భాష, సాహిత్యాలకు చేసిన సేవ వెలకట్టలేనిది. సిద్ధాంత రీత్యా ఆయనను వ్యతిరేకించే వారు సైతం ఓ మహాకవిగా శ్రీశ్రీని ఎంతగానో గౌరవిస్తారన్నది సత్యం!
తాజావార్తలు
-
Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
-
Ravi Bishnoi: రవి బిష్ణోయ్లో అంత చేంజ్ ఎలా వచ్చింది.. ఆ ఒక్క మార్పుతో ఫామ్లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్..
-
Prabhas Sreenu: “ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!”
-
NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
-
Prabhas Srinu: “అర్ధరాత్రి అడవిలో నాటుకోడి కోసం వేట.. ప్రభాస్ కోసం చేసిన పని చెప్పిన ప్రభాస్ శ్రీను!”
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!