Madhuri : బిగ్ బాస్ సీజన్-9లో ఈ వారం మాధురి ఎలిమినేట్ అయింది. అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెపై ఎన్ని రకాల ట్రోల్స్ వచ్చాయో మనం చూశాం కదా. మరీ ముఖ్యంగా భరణితో మాధురికి లవ్ ట్రాక్ అంటూ నానా రకాల మీమ్స్, కథనాలు వచ్చాయి. వీరిద్దరూ దీపావళి సందర్భంగా చేసిన డ్యాన్స్ మీద అయితే చెప్పలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చి పడ్డాయి. ఇక మొన్నటి ఆదివారం నాడు అందరూ ఊహించినట్టే మాధురి ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. రెండు వారాలకే బయటకు వచ్చేసింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అనేక అంశాలపై స్పందించింది.
Read Also : Samantha : సమంత తాజా లుక్‌పై నెటిజన్ల షాక్ – “తను మన సామ్ ఏనా ?” అంటూ కామెంట్లు..!
మరీ ముఖ్యంగా భరణితో డ్యాన్స్ చేయడంపై వచ్చిన ట్రోల్స్ గురించి రియాక్ట్ అయింది. అసలు నేను భరణి గురించే పట్టించుకోలేదు. హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి కేవలం నా ఆటమీదనే దృష్టి పెట్టాను. దీపావళి రోజు నాగార్జున గారు అడిగారు కాబట్టే భరణితో డ్యాన్స్ చేశాను. కానీ అతని చేయి కూడా నేను టచ్ చేయలేదు. అందులో ఎలాంటి అశ్లీలత లేదు. కేవలం ఫన్ కోసమే అలా చేశాను. అయినా సరే దాని మీద ట్రోల్స్ చేశారంటే.. వాడు మనిషి కాదు పశువుతో సమానం అంటూ ట్రోలర్స్ పై మండి పడింది. తాను ఎంతో పద్ధతిగా హౌస్ లో ఉన్నానని.. అందరితో న్యూట్రల్ గా ఉండటమే తనకు నచ్చతుందని తెలిపింది మాధురి.
Read Also : SSMB29 : మహేష్ బాబు – రాజమౌళి కాంబో సెన్సేషన్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..!
