Site icon NTV Telugu

సన్నీలియోన్ కి హోంమంత్రి వార్నింగ్.. ఆ వీడియో డిలీట్ చేయాలంటూ

sunny leone

sunny leone

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ మరో వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సన్నీ నటించిన “మధుబన్ మే రాధికా నాచే” ఆల్బమ్‌ చిక్కుల్లో చిక్కుకుంది. ఈ సాంగ్ లో రాధాకృష్ణల ప్రేమకథను తప్పుగా చూపించారని, లిరిక్స్ అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలు హిందూ వర్గాలు దుమ్మెత్తిపోశాయి. ఇక తాజాగా ఈ సాంగ్ పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://ntvtelugu.com/thaman-to-score-the-bgm-of-radhe-shyam-for-south-languages/

“ఈ మ్యూజిక్ ఆల్బమ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం .. ఆమెను నర్తకిగా, అరకొర బట్టలు వేసుకొని చూపిస్తే మేము బాధపడతాం. అందుకే ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయండి. వారికి మూడు రోజులు సమయం ఇస్తున్నాం.. ఈలోపు ఆ వీడియోను డిలీట్ చేయకపోతే తీవ్రమైన చర్యలు చేపట్టాలివస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి మంత్రి వ్యాఖ్యలపై సన్నీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version