Madhubala: ఛాన్స్ ఇస్తే నెగెటివ్ రోల్స్ కూ సై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhubala: నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’తో టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు నటి మధుబాల. ఇటీవల ‘గేమ్ ఆన్’ అనే సినిమాలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక డిసెంబర్ 2న రాబోతున్న త్రిగుణ్, మేఘా ఆకాశ్ మూవీ ‘ప్రేమదేశం’లోనూ మధుబాల కీ-రోల్ ప్లే చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఇందులోని తన పాత్ర గురించి, ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి ఆమె ఇలా షేర్ చేసుకున్నారు. ”నేను గతంలో హీరోయిన్ గా నటించాను. అయితే ఇప్పుడు అలాంటి పాత్రలు చేయలేను కాబట్టి తల్లి పాత్రలు చేస్తున్నాను. ‘ప్రేమదేశం’లోని ఈ పాత్రను నా కోసమే రాశానని దర్శకుడు అన్నారు. నేను ముందు నో చెప్పాను. కానీ పలు మార్లు కలిసి ఒత్తిడి చేయడంతో అంగీకరించాను. అయితే ఈ మూవీ చేస్తున్న సమయంలో ఇది ఎంత మంచి పాత్రో అర్థమైంది. నిజానికి ఇందులో నేను ఒక హీరోయిన్ లాంటి పాత్రలోనే కనిపిస్తాను. తల్లీకొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించారు. త్రిగుణ్ చాలా సహజంగా నటించాడు. అతని నటన చూసిన తర్వాత నాకూ కాన్ఫిడెన్స్ పెరిగింది. అలానే ఈ టైటిల్, మ్యూజిక్ కూడా నాకెంతో నచ్చాయి” అని అన్నారు. సినీరంగంలోని తన అనుభవాలను చెబుతూ, ”ఇండస్ట్రీలో ఎప్పుడూ పోటీతత్వం ఉంటుంది. హీరోయిన్గా చేసినప్పుడు అంతే, ఇప్పుడూ అంతే. కానీ దాన్ని నేను కాంపిటీషన్‌లా ఎప్పుడూ చూడను. మనకు ఏ పాత్ర రాసి ఉంటే.. అవే వస్తాయని భావిస్తాను. తమిళ్లో ‘స్వీట్ కార్న్ కాఫీ’ అనే వెబ్ సిరీస్‌లో నేను ఫుల్ కామెడీ రోల్ చేశాను. నేను మామూలుగానే సరదాగా ఉంటాను. ఆ వెబ్ సిరీస్ చూశాక.. అందరూ నా కామెడీ టైమింగ్ బాగుందని అభినందించారు. నాకు సినిమాల్లోనూ కామెడీ రోల్ చేయాలని ఉంది” అని చెప్పారు.
‘తెలుగు, హిందీ భాషలు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందని, తమిళ్, మిగతా భాషలు కాస్తంత డిఫరెంట్ గా ఉంటాయని, తెలుగు భాష పూర్తిగా రాకపోయినా, దర్శకులతో చర్చించే ఆస్కారం ఎక్కువ ఉంటుందని, ఇప్పుడు తెలుగులో పని చేస్తేనే రీచ్ ఎక్కువ కాబట్టి, ఇకపై తాను తెలుగు సినిమాల మీదనే ఫోకస్ పెడతాన’ని మధుబాల తెలిపారు. ‘ప్రస్తుతం తనను ఎవరూ ముంబై అమ్మాయిగా ట్రీట్ చేయడం లేదని, తాను కూడా ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషకు చెందిన అమ్మాయిగా కనిపించేందుకు ప్రయత్నిస్తాన’ని అన్నారు. తాను ఎక్కువ నార్త్ ఇండియాలనూ, ఎక్కువ సౌత్ ఇండియన్ లానూ కనిపించనని, అదే తనలో ప్లస్ పాయింట్ అని మధుబాల తెలిపారు. ఛాన్స్ ఇవ్వాలే కానీ కామెడీ రోల్ తో పాటు నెగెటివ్ రోల్ సైతం చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలతో పాటు జీ 5 కోసం ఓ వెబ్ సీరిస్ లో నటిస్తున్నట్టు మధుబాల తెలిపారు.
Also Read
- Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
- KorianKanakaRaju : భారీ ధర పలికిన 'కొరియన్ కనకరాజ్' ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
- Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
- Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
తాజావార్తలు
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!