Site icon NTV Telugu

Madhav Bhupathiraju: రవితేజ సూపర్ హిట్ టైటిల్‌పై కన్నేసిన తమ్ముడి కొడుకు.. హిట్టు పక్కానే ఇక?

Mr Idiot Movie

Mr Idiot Movie

Madhav Bhupathiraju’s Mr Idiot pre look released: రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా లాంచ్ అవుతున్నట్లు గత ఏడాది అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాదు ఆయన హీరోగా ఏకంగా రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. అయితే అందులో రెండో సినిమా షూటింగ్ అయితే పూర్తి కావచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సినిమాకి తన పెదనాన్నకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన ఒక సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ సినిమాకు ‘మిస్టర్ ఇడియట్’ టైటిల్ ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్, ప్రీ లుక్ విడుదల చేశారు. మాధవ్ హీరోగా తెరకెక్కిన ఈ ‘మిస్టర్ ఇడియట్’ టైటిల్ పోస్టర్ ను రవితేజ విడుదల చేశారు. ఇక ప్రీ లుక్ విడుదల చేసిన అనంతరం సినిమా యూనిట్ కి మాస్ మహారాజా అభినందనలు తెలుపుతూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్‌కి స్పెషల్ ట్రైనింగ్…ఆ 3 నెలలు మిస్సింగే ఇక!

”హీరోగా నా కెరీర్‌లో ‘ఇడియ‌ట్’కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో అంద‌రికీ తెలిసిందే, ఇప్పుడు మా ర‌ఘు కొడుకు మాధ‌వ్ ‘మిస్టర్ ఇడియ‌ట్‌’గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు, నాలాగే త‌న‌ కెరీర్‌లో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను” అని రవితేజ తెలిపారు. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో రూపొందుతున్న ‘మిస్టర్ ఇడియట్’ చిత్రానికి ‘పెళ్లి సందD’ ఫేమ్ గౌరీ రోణంకి దర్శకురాలు కాగా జేజేఆర్ రవిచంద్ నిర్మాత, ఈ సినిమాలో సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘మిస్టర్ ఇడియట్’ ప్రీ లుక్ చూస్తే… ఓ అమ్మాయికి లిప్ కిస్ ఇస్తున్న హీరో, మరో అమ్మాయి వెళ్ళకుండా చేతితో పట్టుకోవడం కనిపిస్తోంది, ఈ సినిమా ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా అని యూనిట్ వర్గాలు తెచెబుతున్నాయి.

Exit mobile version