నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్ స్క్వేర్. గతంలో వచ్చిన మ్యాడ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ట్రైలర్, సాంగ్స్ తో విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే జోరు చూపించింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.కాగా ఈ సినిమా తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. టాలీవుడ్ లోని టైర్ 2 హీరోల డే 1 కలెక్షన్స్ కంటే ఎక్కువ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చ్యర్య పరించింది. మరి ముఖ్యంగా నైజాంలో సెన్సేషన్ స్టార్ట్ అందుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారి కలెక్షన్స్ చూస్తే..
నైజాం – రూ. 2.35 కోట్లు
సీడెడ్ – రూ. 0.74 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 0.62 లక్షలు
ఈస్ట్ గోదావరి – రూ. 0.37 లక్షలు
పశ్చిమ గోదావరి – రూ. 0.21 లక్షలు
కృష్ణ – రూ. 0.28 లక్షలు
గుంటూరు – రూ. 0.51 లక్షలు
నెల్లూరు – రూ. 0.19 లక్షలు
మొత్తం కలెక్షన్ (షేర్) – రూ. 5.27 కోట్లు..
నేడు వీకెండ్ కావడం రానున్న రెండు రోజులు పబ్లిక్ హాలిడే కావడంతో మ్యాడ్ స్క్వేర్ బ్రేక్ ఈవెన్ దాటి భారీ కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.