Taidala Bapu: చిత్ర నిర్మాణంలోకి గేయ రచయిత తైదల బాపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘6 టీన్స్, గర్ల్‌ఫ్రెండ్,పటాస్, ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్ శ్రీరామ్, అధినేత, సెల్ఫీరాజా’ వంటి సినిమాల్లో పలు సూపర్ హిట్ పాటలు రాసిన తైదల బాపు నిర్మాత కాబోతున్నాడు. తన పాటలతో యువతను ఆకట్టుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తైదల బాపు పుట్టినరోజు ఏప్రిల్ 25 పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు.
విద్యార్థి దశ నుండే పాటలు రాయడం అలవర్చుకున్న తను ఓ టీవీ ఛానల్ పాటల పోటీలో విన్నర్‌గా నిలవంటంతో ఇంట్లో చెప్పకుండా 1998లో హైదరాబాద్‌కు వచ్చి జానపదంలో ఉన్న పట్టుతో వందేమాతరం శ్రీనివాస్‌కు పాటలు పాడి వినిపించడం, ఆలా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘6 టీన్స్’, ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలతో గేయ రచయితగా పరిచయం అవటం జరిగిందన్నారు. ఆ సినిమాలలో ‘నువ్వేడికెళ్తి ఆడికొస్తా సువర్ణా..’, ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’, ‘లష్కర్ బోనాల కాడ..’ వంటి సూపర్ హిట్ పాటలు తనకు మంచిపేరు తీసుకు రావడంతో వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకపోయిందన్నారు. దాదాపు 500కు పైగాపాటలు రాశానని, అలాగే పలు సాంస్కృతిక సంస్థల నుంచి అవార్డులు అందుకోవడంతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో రాసిన పాటలు పలువురిలో స్ఫూర్తిని రగిలించాయన్నారు. ఇక కరోనా సమయంలో మంచిర్యాల జిల్లాలో కొన్ని గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసరాలు అందించటం, ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో 2022వేల మొక్కలను నాటడానికి సన్నాహాలు చేస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోందన్నాడు. త్వరలో చిత్ర నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెడుతున్నానని, మంచి పాటలు రాస్తూ, ప్రేక్షకులను అలరించేలా మంచి చిత్రాలు తీయలన్నదే తన కోరిక అంటున్నాడు తైదల బాపు.
Also Read
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
- Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్‌ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!