Lucky Baskhar: మన లెఫ్టినెంట్ రామ్.. ఇప్పుడు లక్కీ భాస్కర్ గా వస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucky Baskhar: భాషతో సంబంధం లేకుండా కథ నచ్చినా.. నటన నచ్చినా సినిమానే కాదు నటీనటులను కూడా తెలుగువారు దగ్గరకు తీసుకుంటారు. అలా మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లెఫ్టినెంట్ రామ్ గా గుర్తుండిపోయాడు. సీతారామం సినిమాతో దుల్కర్ తెలుగు కుర్రాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇక విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను అన్నిభాషల్లో చేసుకుంటూ పోతున్నాడు. సీతారామం తరువాత తెలుగులో దుల్కర్ నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్.
గత ఏడాది సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో దుల్కర్ లక్కీ భాస్కర్ గా కనిపించనున్నాడు. చుట్టూ డబ్బు కట్టలు.. మధ్యలో బ్యాంక్ ఉద్యోగిగా కళ్ళజోడు పెట్టుకొని, నీట్ గా మధ్య పాపిడి తీసుకొని సూట్ కేసుతో నడుస్తూ దుల్కర్ కనిపించాడు. పోస్టర్ ను బట్టే ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. సార్ కు సంగీతం అందించిన జీవి ప్రకాషే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ అమ్మాడి ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!