యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ చేస్తున్న సినిమా తలైవర్ 171. సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ కోలాబోరేషన్ ఇంత ఎర్లీగా జరుగుతుందని సినీ అభిమానులు కలలో కూడా ఊహించలేదు. “కోడ్ రెడ్” అనే టైటిల్ చెక్ లిస్టులో ఉన్న తలైవర్ 171 సినిమా కథని రాయడానికి లోకేష్ ఆఫ్ లైన్ వెళ్లిపోయాడు. తన ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే ముందు కొన్ని రోజుల పాటు కథని రాసుకోవడానికి ఆఫ్ లైన్ వెళ్లిపోతాడు లోకేష్. ఫోన్, సోషల్ మీడియా సైట్స్ కి కంప్లీట్ గా దూరంగా వెళ్లిపోయి స్క్రిప్ట్ ని రెడీ చేయడం లోకి స్టైల్. ఇప్పుడు తలైవర్ 171 సినిమా విషయంలో కూడా ఇదే ఫాలో అవుతూ లోకేష్, ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసాడు.
Read Also: Darshan: కాటేరా ట్రైలర్ ఊరమాస్ గా ఉంది…
ఇటీవలే లోకేష్ ‘G స్క్వాడ్’ బ్యానర్ పై ప్రెజెంట్ చేసిన ఫైట్ క్లబ్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి అన్ని సెంటర్స్ నుంచి హిట్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఫైట్ క్లబ్ సినిమాని సపోర్ట్ చేసిన వాళ్లకి థాంక్స్ చెప్తూ… తలైవర్ 171 ప్రాజెక్ట్ కోసం ఆఫ్ లైన్ వెళ్తున్నట్లు చెప్పాడు లోకేష్. రజినీ తన సినిమాలో నెగటివ్ షేడ్ లో, విలనీ టచ్ తో ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నాడు అని గతంలోనే రివీల్ చేసాడు లోకేష్. మరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన లోకేష్ కనగరాజ్, ఎలాంటి యాక్షన్ ఎక్స్ట్రావెంజా కథని రాస్తాడు? రజినీకాంత్ ని ఎలా చూపిస్తాడు? ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ కూడా నటిస్తున్నాడు అనే వార్త వినిపిస్తోంది, అందులో నిజముందా లేదా అనే విషయాలు తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
🤗❤️ pic.twitter.com/0EL6PAlbdQ
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 16, 2023