రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ కెప్టెన్ విజయకాంత్ మాత్రం మార్కెట్ కోసం ఏ రోజు ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. తనకంటూ కోలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ వచ్చిన సమయంలో కూడా విజయకాంత్ తమిళ సినిమాని వదిలి ఇతర ఇండస్ట్రీల్లో వర్క్ చేయలేదు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు హిందీ, తెలుగులో రీమేక్ అయ్యాయి, డబ్ అయ్యాయి కానీ స్ట్రెయిట్ సినిమాలు మాత్రం చెయ్యలేదు.
Read Also: Vijayakanth: మార్కెట్ కోసం ఇతర భాషల్లో సినిమాలు చేయని ఏకైక తమిళ స్టార్
పోలీస్ అధికారం, కెప్టెన్, కెప్టెన్ ప్రభాకరన్, మరణ మృదంగం, పదవీ ప్రమాణం, రౌడీ నాయకుడు, ఇండియన్ పోలీస్, క్రోధం, సిటీ పోలీస్, ఛాలెంజ్ రౌడీ, రౌడీలకి రౌడీ, సెక్యూరిటీ ఆఫీసర్, మా బావ బంగారం, నేటి రాక్షసులు, అమ్మను చూడాలి, బొబ్బిలి రాయుడు లాంటి సినిమాలతో కెప్టెన్ విజయకాంత్ తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యాడు. చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా తమిళ్ లో విజయకాంత్ నటించిన రమణ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాని విజయకాంత్ తమిళ్ లో గజేంద్రగా రీమేక్ చేసాడు. బాలయ్య నటించిన భానుమతి గారి మొగుడు సినిమా కూడా విజయకాంత్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఇలా తెలుగు సినిమా పెద్దలకి, అభిమానులకి బాగా దగ్గరైన విజయకాంత్ మరణించిన వార్త తెలుసుకోని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా శోకసంద్రంలో మునిగాయి.