Liger Trailer : హైదరాబాద్, ముంబైలో ‘లైగర్’ గ్రాండ్ ఈవెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Liger’ grand event in Hyderabad, Mumbai!
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్’ (సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ జూలై 21న విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సౌత్ తో పాటు నార్త్ లో కూడా నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, ఛార్మి కౌర్, ఇతర టీమ్ సభ్యుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి చర్చిస్తున్న వీడియోని ఈ సందర్భంగా విడుదల చేశారు. ఛార్మి రెండు ఈవెంట్లను నిర్వహించాలనే ప్రతిపాదనను ఉంచగా, కరణ్ దానిని ఆమోదించగా, ట్రైలర్ తుఫాను సృష్టించబోతోందని విజయ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఈవెంట్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. ముంబై ఈవెంట్ అంధేరిలోని సినీ పోలిస్‌లో సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. ‘లైగర్’ టీమ్ ఇప్పటికే టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ ని క్రియేటర్ చేయగా, ట్రైలర్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తుఫాన్ ని సృష్టించడానికి రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌పై అరంగేట్రం చేస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
Mass Cinema- Mass Trailer Launch🔥
2 City Trailer Launch!
📍HYDERABAD
📍MUMBAIJust 3 days to go.#LigerTrailerOnJuly21#Liger #LIGERTrailer@TheDeverakonda @MikeTyson @ananyapandayy @karanjohar #PuriJagannadh @PuriConnects @DharmaMovies @sonymusicindia pic.twitter.com/jykoOhmhkg
— Charmme Kaur (@Charmmeofficial) July 18, 2022
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!