Leo Trailer:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు అందరూ విజయ్ నటిస్తున్న లియో సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటిస్తుండగా.. అర్జున్ సర్జా, సంజయ్ దత్ విలన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్. టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి.ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న లియో ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్.. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ను లోకేష్ దింపేశాడు.
Prabhas: ఓరీ.. మీ ఎడిట్లు పాడుగాను.. జనాలను చంపేస్తారారా..?
” సీరియల్ కిల్లర్ నడిరోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు.. ఆల్రెడీ రోడ్డు మీద అందరు చనిపోయారు. వాడు చాలా క్రూరుడు.. వాడు అందరిని కాలుస్తున్నాడు.. అప్పుడు దైర్యంగా ఒక పోలీసాఫీసర్ సింహంలా వచ్చి ఆ కిల్లర్ ను కాల్చాడు.. అతను కాల్చిన గన్ నీ చేతిలో.. ” అని విజయ్ వాయిస్ ఓవర్ వస్తుండగా.. ఆ స్టోరీను చూపించారు. ఇక ఆ కిల్లర్ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చూపించారు. ఆ కిల్లర్ ను చంపిన గన్.. పార్దీ(విజయ్) చేతిలో ఉండడంతో.. విలన్స్ అతని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అది అతను కాదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా సేమ్ కిల్లర్ ను చంపిన పోలీస్ లానే ఉండడంతో పార్దీ వెనుక పడతారు. అతని కుటుంబాన్ని కూడా వెంబడిస్తూ ఉంటారు. అయితే కుటుంబం జోలికి రావడంతో పార్దీ ఎదురుతిరుగుతాడు. ఈ మాఫియా గొడవల్లో కిల్లర్ ను చంపింది లియో అని తెలుస్తోంది. అసలు ఈ లియో ఎవరు.. ? ఎందుకు కిల్లర్ ను చంపాడు.. లియో, పార్దీ ఇద్దరు ఒకేలా ఎందుకు ఉన్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ లో విజయ్ డబుల్ రోల్ లో కనిపిస్తున్నట్లు లోకేష్ హింట్ ఇచ్చాడు. అయితే అది కేవలం ప్రమోషన్స్ కోసమా.. ? లేక లియో, పార్దీ ఒకరేనా.. ? అనేది తెలియాలి. ఇక అక్టోబర్ 19 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.