కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ “వలీమై” ఫిబ్రవరి 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటించారు. బోనీకపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, యామీ గౌతమ్, బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా రన్ టైమ్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి కావడంతో సినిమా రన్ టైంపై అందరి దృష్టి పడింది.
Read Also : Aishwaryaa: విడాకుల తరువాత ధనుష్ భార్య సంచలన వ్యాఖ్యలు..
ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికేట్ పొందిన ‘వలీమై’ అధికారిక రన్‌టైమ్ 2 గంటల 56 నిమిషాలుగా ఉంది. ఇటీవలి కాలంలో విడుదలైన ఏ బిగ్ మూవీకి ఇంత రన్ టైం లేదనే చెప్పాలి. దీంతో అజిత్ సినిమాకు లెంగ్తీ రన్ టైమ్ అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రన్ టైం సుదీర్ఘంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టగలిగే పలు హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, స్టోరీ ఉందని అంటున్నారు అజిత్ అభిమానులు. సినిమా విడుదలకు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ‘వలీమై’ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు. ఈ మూవీ ఫిబ్రవరి 24న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు కానుంది. మరోవైపు అజిత్ ‘AK61’తో బిజీగా ఉన్నారు.