ఫ్యాషన్ ప్రపంచంలో మహిళల కలలకు రంగులు అద్దుతూ, వైవిధ్యమైన డిజైన్‌లతో అలరిస్తున్న ‘లెగ్దా డిజైన్ స్టూడియో’ తన రెండో బ్రాంచ్‌ను హబ్సిగూడలో ఘనంగా ప్రారంభించింది. టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ బ్రాంచ్‌ను ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ స్ట్రీట్ వాక్ షో అందరి దృష్టిని ఆకర్షించింది. మోడల్స్ ఆధునిక ఫ్యాషన్ డిజైన్‌లను అద్భుతంగా ప్రదర్శించి, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనన్య నాగళ్ల, “మహిళలు తమ కలల డిజైన్‌లను ధరించి, స్వయం ప్రతిష్ఠను పొందేందుకు ‘లెగ్దా డిజైన్ స్టూడియో’ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. మహిళలకు ఉపాధి కల్పిస్తూ, వారి సృజనాత్మకతకు మద్దతుగా నిలుస్తున్న దివ్య కర్నాటి గారిని అభినందిస్తున్నాను. ఈ బ్రాంచ్ ద్వారా మరింత మంది మహిళలు తమ ఫ్యాషన్ కలలను సాకారం చేసుకుంటారని నమ్ముతున్నాను,” అని అన్నారు.