Site icon NTV Telugu

‘L.G.M’: ధోనీ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది!

Lgm

Lgm

MS Dhoni: లెజెండరీ ఇండియన్ క్రికెటర్ ఎం.ఎస్. ధోని, సాక్షి ధోని నిర్మాణ సంస్థ ధోని ఎంటర్‌టైన్‌మెంట్ తొలి ప్రాజెక్ట్ ‘ఎల్‌జీఎం’ ప్రారంభమైనప్పటి నుంచి సినీ అభిమానులను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహిస్తున్న ‘ఎల్‌జీఎం’ ఫస్ట్‌లుక్‌ని ధోనీ తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో విడుదల చేశారు. ఇది ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
దీనిపై చిత్ర నిర్మాత వికాస్ హసిజా హర్షం వ్యక్తం చేస్తూ, “‘ఎల్‌జిఎం’ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. షూటింగ్ చివరి షెడ్యూల్‌లో ఉన్నాం. త్వరలో పోస్ట్-ప్రొడక్షన్‌కి వెళ్తాం. ఇది గ్రేట్ జర్నీ” అని తెలిపారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రియాంషు చోప్రా మాట్లాడుతూ “సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ వుంటాయి. మొత్తం నటీనటులు, సిబ్బంది చాలా ప్రతిభావంతులు. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ తో సినిమా రాబోతుంది” అన్నారు. ‘ఎల్‌జీఎం’ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా టైటిల్ రోల్స్‌ పోషిస్తుండగా యోగి బాబు, మిర్చి విజయ్ మరికొంత మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ తమిళ్ మణి సంగీతం కూడా అందిస్తున్నారు.

Exit mobile version