Laya: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లయ. అచ్చ తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లయ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోండి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొనేలా చేసింది. ఇక ఈ సినిమా తరువాత లయ వరుస సినిమాలతో.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. భర్త ఉద్యోగరీత్యా విదేశాల్లో సెటిల్ అవ్వగా.. ఆమె కూడా అక్కడే సెటిల్ అయిపోయింది. లయకు ఇద్దరు పిల్లలు. ఇక చిన్నతనం నుంచి లయ డ్యాన్సర్ కావడంతో.. విదేశాల్లోనే ఒక డ్యాన్స్ స్కూల్ ను నడుపుతూ.. తనకు నచ్చినట్లు జీవిస్తోంది. సోషల్ మీడియా రాకముందు ఆమె గురించి అంతగా తెలియకపోయినా.. సోషల్ మీడియా వచ్చాకా దాన్ని లయ ఎంతో చక్కగా వినియోగించుకుంది. ట్రెండింగ్ సాంగ్స్ కు, స్టార్ హీరోల సాంగ్స్ కు రీల్స్ చేస్తూ మరోసారి అభిమానులను పలకరించింది.
Mounika Reddy: భీమ్లా నాయక్ బ్యూటీ విడాకులు.. అసలు నిజం ఇదే..?
ఫ్రెండ్స్, కుటుంబంతో కలిసి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మధ్యనే ఇండియా వచ్చిన లయ.. మంచి అవకాశం వస్తే తిరిగి నటిస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ఎట్టకేలకు ఆ ఛాన్స్ వచ్చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. నితిన్ కొత్త సినిమాలో లయ ఒక కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్.. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, తమ్ముడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమాలో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారికంగా లయను ప్రకటించనున్నారట. మరి ఈ సినిమాతో లయ రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.