Ghani: వరుణ్ తేజ్ కు విషెస్ చెప్పిన సొట్టబుగ్గల సుందరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ తేజ్ ‘గని’ మూవీ శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ కు, ‘గని’ చిత్ర బృందానికి విషెస్ చెప్పింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. మామూలుగా అయితే… ఇందులో పెద్దంత ప్రత్యేక ఏమీ లేదు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యలో సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనే పుకారు షికారు చేస్తోంది. ‘అందాల రాక్షసి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అయోధ్య భామ… వరుణ్ తేజ్ సరసన తొలిసారి ‘మిస్టర్’ మూవీలో నటించింది. ‘గని’ దర్శకుడు కిరణ్ కొర్రపాటి అదే సినిమాకు కో-డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అప్పటి ఆ పరిచయమే ఇప్పుడు ‘గని’ తో అతను డైరెక్టర్ కావడానికి కారణమైంది. అయితే ‘మిస్టర్’ చిత్రం పరాజయం పాలైనా, ఆ తర్వాత ‘అంతరిక్షం’ మూవీలో మరోసారి వరుణ్ తేజ్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది లావణ్య త్రిపాఠి.
ఇక ఆమెకు మెగా ఫ్యామిలీ హీరోలతోనూ బాగానే సాన్నిహిత్యం ఉంది. గీతా ఆర్ట్స్, దాని అనుబంధం సంస్థల్లోనూ ‘భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు – శుభమస్తు, చావు కబురు చల్లగా’ వంటి సినిమాలలో నటించింది లావణ్య త్రిపాఠి. మొత్తం మీద రేపు ‘గని’ విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ను లావణ్య ”ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. మీ బృందం చేసిన హార్డ్ వర్క్ కు తగిన ప్రతిఫలం ప్రేక్షకుల నుండి లభించాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రత్యేకంగా విషెస్ చెప్పడం మరోసారి టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది.
Also Read
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
Wishing @IAmVarunTej and the team #Ghani all the very best for tomorrow, you gave your 110 % to this role, and i pray that you & your team’s hard work will be rewarded by our incredible audience! 🍀 #GhaniFromApril8th pic.twitter.com/KVeYNUn3H7
— Lavanya konidela tripathi (@Itslavanya) April 7, 2022
తాజావార్తలు
-
H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
-
Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
-
AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
-
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
-
Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!