Lavanya Tripati: అందాల రాక్షసి సినీరంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఇక ఈ సినిమాతరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా లావణ్య.. తన మంచి మనసును చాటుకుంది. సాధారణంగా హీరోయిన్లు అందరు తమ వీకెండ్ ను రిసార్ట్ లోనో.. పబ్ లోనో , ఫ్రెండ్స్తోనో ఎంజాయ్ చేస్తారు. కానీ మా అందాల రాక్షసి మాత్రం తన వీకెండ్ ను ఈసారి అనాథ ఆశ్రమంలో గడిపింది. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహంలో లావణ్య త్రిపాఠి సందడి చేసింది. విధి రాతలో అమ్మానాన్నలను దూరం చేసుకున్న ఎంతో మంది విద్యార్థులు ఈ గృహంలో చదివి ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడుతున్నారనే విషయం తెలుసుకున్న లావణ్య…. ఓరోజు వారితో సరదాగా గడపాలని నిర్ణయించుకుందట. ఈ మేరకు అనాథ విద్యార్థి గృహాన్ని సందర్శించి అక్కడి విశేషాలను వ్యవస్థాపకులు మార్గం రాజేశ్ ను అడిగితెలుసుకుంది.
Upasana Konidela: మెగా కోడలి సీమంతం.. రంగరంగ వైభవములే
విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేసిన లావణ్య… విద్యార్థులతో కలిసి మధ్యాహ్నా భోజనం ఆరగించింది. అనాథ విద్యార్థి గృహంలో పిల్లలకు కావల్సిన అత్యవసర మందులను కానుకగా అందించి మానవత్వాన్ని చాటుకుంటుంది. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ…. తమ కుటుంబంలో ఎవరు సినీ పరిశ్రమతో సంబంధం లేకున్నా….11 ఏళ్ల ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ మంచి నటిగా ఎదిగానని వివరించింది. తనకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇక లావణ్య మంచి మనసును అభిమానులు ప్రశంసిస్తున్నారు. అప్పుడప్పుడు మిగతా హీరోయిన్లు కూడా ఇలా చేయాలనీ సలహాలు ఇస్తున్నారు.