అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ‘లావణ్య త్రిపాఠి’ మొదటి సినిమాతోనే మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న లావణ్య, ఒటీటీలోకి ఎంటర్ అవుతూ చేస్తున్న ప్రాజెక్ట్ ‘పులి మేక’. జీ5లో ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమ్ అవ్వనున్న ఈ సినిమాని చక్రవర్తి రెడ్డి డైరెక్ట్ చెయ్యగా, కోన వెంకట్ కథని అందించాడు. కోన కార్పోరేషన్, జీ5 కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ‘పులి మేక’ సినిమాలో ఆది సాయి కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటివరకూ గ్లామర్ హీరోయిన్ గానే కనిపించిన లావణ్య త్రిపాఠి మొదటిసారి యాక్షన్ చేస్తూ పోలిస్ పాత్రలో కనిపించడంతో ‘పులి మేక’పై ఆడియన్స్ దృష్టి పడింది.
Read Also: Puli – Meka: అందాల రాక్షసి చేతిలోకి పిస్టల్ ఎందుకొచ్చింది!?
రామ్ చరణ్ లాంచ్ చేసిన ‘పులి మేక’ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ బయటకి వచ్చిన నెక్స్ట్ డేని లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ ని సంబంధించిన స్పెషల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హాఫ్ మినిట్ ఉన్న ఈ టీజర్ లో లావణ్య త్రిపాఠి మొహానికి పసుపు పూసుకోని, ఎర్ర చీర కట్టుకోని అదిరిపోయే ఫైట్స్ చేస్తూ కనిపించింది. లావణ్యని ఇప్పటివరకూ ఇలా చూడకపోవడంతో టీజర్ చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ మహా శివరాత్రి స్పెషల్ టీజర్ ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంచ్ చేసింది. ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ లోకి రానున్న ‘పులి మేక’లో కంటెంట్ బాగుంటే లావణ్య కెరీర్ కి హ్యుజ్ టర్న్ దొరికేసినట్లే.
Read Also:
Very excited to see @Itslavanya in a power-packed action role.check it out❤️😁
🔗https://t.co/jacnnolt9w#PuliMekaOnZee5 on 24 FEB@Zee5Telugu @iamaadisaikumar @RajaChembolu @ImSpandanaa @mrnoelsean @Chakrif1 @konavenkat99 @KonaFilmCorp @ChotaKPrasad @brahmakadali @NeerajaKona— Rakul Singh (@Rakulpreet) February 18, 2023