Puli – Meka: అందాల రాక్షసి చేతిలోకి పిస్టల్ ఎందుకొచ్చింది!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavanya Tripathi: సాధారణంగా నేరాలు జరిగినప్పుడు ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తారు. మరి వారినే ఓ హంతకుడు టార్గెట్ చేసి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తారు? భయంకరమైన పనులు చేసే వ్యక్తిని మృగం అంటుంటాం. మృగంలాంటి వేషంతో ఓ వ్యక్తి అలాంటి పనులు చేస్తే దాన్నేమనాలి. ఆ మృగంలాంటి మనిషి సిటీలో వరుస హత్యలను చేస్తుంటాడు. అయితే అతని టార్గెట్ సాధారణ ప్రజలు మాత్రం కాదు, పోలీసులే. తమ డిపార్ట్‌మెంట్ అధికారులను ఎవరో ఓ వ్యక్తి వరుస హత్యలు చేస్తుంటే పోలీసులు ఏం చేశారు? అనే విషయాలు తెలియాలంటే ‘పులి మేక’ చూడాల్సిందే. జీ 5 ఓటీటీ లైబ్రరీలో ఫిబ్రవరి 24న బెస్ట్ ఒరిజినల్‌గా జాయిన్ కావటానికి ‘పులి మేక’ సిద్ధమవుతుంది. ఈ ఒరిజినల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేషన్‌తో జాయిన్ అయ్యింది. లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్, సుమన్, రాజా ప్రధాన పాత్రలు పోషించిన ‘పులి మేక’ టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు.
‘పులి మేక’ టీజర్‌ను గమనిస్తే .. పోలీసులను మృగంలాంటి వేషధారణతో ఉన్న వ్యక్తి వరుసగా చంపేస్తుంటాడు. అసలు ఈ హత్యలను ఎవరు చేస్తున్నారనేది తెలియక డిపార్ట్మెంట్ తలలు పట్టుకుంటుంది. వెంటనే కేసుని సాల్వ్ చేయటానికి, హంతకుడిని పట్టుకోవటానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. దానికి హెడ్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి). అదే టీమ్‌లో ఫోరెన్సిక్ టీమ్ మెంబర్ ప్రభాకర్ శర్మ (ఆది సాయికుమార్) కనిపిస్తున్నారు. కేసుని సాల్వ్ చేయటానికి పోలీసులు కష్టపడుతుంటే మరో వైపు మీడియా, పై అధికారుల నుంచి తెలియని ఒత్తిడి వారిపై ఉంటుంది. ఈ సన్నివేశాలను చాలా ఇంట్రెస్టింగ్ వేలో టీజర్‌గా కట్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!