Lavanya Reveals Malvi Malhotra Threatened Her :రాజ్ తరుణ్ వ్యవహారంలో అసలు మాల్వీ మల్హోత్రా నిజంగానే మిమ్మల్ని బెదిరించిందా? చంపేస్తామని ఆమె బెదిరించడమే కాక డెడ్ బాడీ కూడా దొరక్కుండా చేస్తానని ఆమె తమ్ముడు బెదిరించడం నిజమేనా అని లావణ్య అడిగితే అది నిజమేనని ఆమె అన్నారు. రాజ్ తరుణ్, మాల్వీలకు ఎప్పుడైతే అఫైర్ ఉందని తెలిసిందో మరో నాలుగు రోజుల్లో పోతుందేమో అని నేను ఎదురు చూస్తున్న సమయంలో రాజ్ తరుణ్ బిహేవియర్ నెమ్మదిగా మారడం మొదలైంది. అతని మనస్తత్వం క్రిమినల్ గా మారిపోవడం నేను గమనించాను. ఇదేంటి ఇలా తయారయ్యాడు అని ఆలోచించి బ్యాక్ సెర్చ్ చేస్తే మాల్వి మల్హోత్రాతో స్నేహం వల్లనే ఈ బిహేవియర్ చేంజ్ అయినట్లు తెలిసింది.
Lavanya: నన్ను రాజ్ తరుణ్ ఆ ఇంట్లో ఎందుకు ఉండనిస్తాడు?
నేను ఇంకా డీప్ గా వెళ్లి ఏంటి అని చెక్ చేయగా రాజ్ తరుణ్ ఆ అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు క్లోజ్ గా ఉన్న చాట్స్ చూశాను.. నేను వెంటనే ఆమెను సంప్రదించి నేను ఒక దాన్ని ఉన్నాను అని నీకు తెలుసా అని అడిగితే మేం జస్ట్ సహ నటుల మాత్రమే అంతకుమించి ఏమీ లేదు అని ఆమె చెప్పింది. నేను ఎప్పుడైతే ఆమెతో ఇలా మాట్లాడానో ఆమె వెంటనే నాకు రాజ్ తరుణ్ తో గొడవ పెట్టింది. ఇదంతా జరుగుతున్నప్పుడే ఆమె తమ్ముడు నాకు మెసేజ్ చేశాడు. మా అక్క రాజు హ్యాపీగా ఉన్నారు. నువ్వు మధ్యలో రాకు కావాలంటే నీకు డబ్బులు ఇస్తామని నాకు వార్నింగ్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని చెప్పారు. నేను ఉండగా వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారు? అప్పుడు నా జీవితం ఏం కాను అని ఆమె ప్రశ్నించారు.