Lavanya Clarity about House She Lived in With Raj Tarun: రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారంలో పోలీసులు రాజ్ తరుణ్ కి షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో లావణ్య ఎన్టీవీతో మాట్లాడింది. ఈ క్రమంలో మీరు కొన్ని కోట్లు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనా? రాజ్ తరుణ్ ను మీరు ఆ ఇల్లు రాసి ఇవ్వమని అడిగింది నిజమేనా అని అడిగితే అది వాస్తవం అని ఆమె పేర్కొంది. రాజ్ తరుణ్ నా ఇంటి నుంచి వెళ్లిన తర్వాత రెండు నెలల్లో తిరిగి వస్తానని అన్నాడు. రెండు నెలలు గడిచింది, రాజ్ తరుణ్ నువ్వు రావటం లేదు ఏమిటి అని అడిగినప్పుడు అబద్ధాలు చెబుతూ వస్తున్నాడు. అతను అబద్ధాలు చెబుతూ మాల్వి మల్హోత్రాతో సమయం గడుపుతున్నాడు.
Lavanya : రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి పారిపోయాడు.. శేఖర్ బాషాతో అదే గొడవ!
అయితే ఎందుకు రావడం లేదు అని అడిగితే నాకు నువ్వు ఇష్టం లేదు నేను నీతో ఉండను ఆ ఇల్లు నీకే రాసిచ్చి నెలనెలా మెయింటినెన్స్ ఇస్తానన్నాడు. కానీ నాకు మనిషే కావాలి అని వాటిని దాటి వచ్చి నేను పోరాడుతున్నాను. ఆ ఇంటి వ్యవహారం మీద క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? ఆ ఇల్లు ఎప్పుడు కొన్నారు? ఎవరెవరి వాటా ఎంత ఉంది? అని అడిగితే భార్యాభర్తలు కొందరు ఇల్లు కొనుగోలు చేసినప్పుడు భర్త పేరు మీద కొందరు భార్య పేరు మీద కొందరు కొనుగోలు చేస్తారు. అయితే అలా చేసినంత మాత్రాన భార్య పేరు మీద ఉన్న ఇల్లు భర్తది కాకుండా పోతుందా? భర్త పేరు మీద ఉన్న ఇల్లు భార్యది కాకుండా పోతుందా? అని ఆమె ప్రశ్నించారు. అది కూడా నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను, ఏ సంబంధం లేకుండా నన్ను రాజ్ తరుణ్ ఆ ఇంట్లో ఎందుకు ఉండనిస్తాడు అని ఆమె ప్రశ్నించారు.