Site icon NTV Telugu

Acharya: ఆచార్య హిందీ రిలీజ్ ఉంటుందా..?

acharya

acharya

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా  శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  ఆచార్య.  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది. అయితే గత కొన్నిరోజులుగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మేడీఐలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విడుదలయ్యే తెలుగు సినిమాలను మార్కెట్ దృష్ట్యా హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవలే బీస్ట్ కూడా హిందీ రిలీజ్ ఉందని ప్రకటించింది. ఇక ఆచార్య కూడా అదే రూట్ లో వెళ్లనున్నదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి, రామ్ చరణ్ కు హిందీలో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమా అక్కడ కూడా బాగానే రాణిస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి త్వరలో  వస్తుందేమో చూడాలి.

Exit mobile version