VD 11 : నాని రిజెక్ట్ చేసిందే విజయ్ చేస్తున్నాడా..?
సినిమా రంగంలో అన్ని అనుకున్నట్లు జరగవు.. కొన్నిసార్లు జీవితాలు తారుమారు అయ్యినట్లే కథలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. ఒక హీరోను ఉహించుకొని కథను రాసుకున్న డైరెక్టర్ కొన్నిసార్లు వేరే హీరోతో ఆ కథను తీయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు చివరి నిమిషంలో హీరో మారిపోతూ ఉంటాడు. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతుందా..? అంటే నిజమేనని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. నేడు పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను నాని వదులుకున్నాకే వీడీకి వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి.
నాని- శివ నిర్వాణ కాంబోలో ఇప్పటికే నిన్నుకోరి, టక్ జగదీష్ వచ్చాయి. నిన్నుకోరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువగా.. టక్ జగదీష్ ప్లాప్ ను మూటగట్టుకుంది. ఇక ఈ ప్లాప్ తరువాత నానికి చెప్పిన కథే ఇదని, శివతో మరోసారి రిస్క్ చేయడం ఇష్టం లేని నాని ఆ కథను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత శివ అదే స్క్రిప్ట్ ని విజయ్ కి చెప్పాడని, అతను దానిని చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఏదిఏమైనా నాని రిజెక్ట్ చేసిన కథను విజయ్ దేవరకొండ ఒప్పుకోవడం, అది వెంటనే సెట్స్ మీదకు వెళ్లడం కూడా జరిగిపోయాయి. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే నాని అనవసరం గా వదులుకున్నాడని, ఒకవేళ ప్లాప్ అయితే మంచి పని చేశాడని నెటిజన్లు మాట్లాడుకోవడం కామనే.. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో