Site icon NTV Telugu

Nayan Tara: మొన్న సీక్రెట్ గా పెళ్లి.. ఇప్పుడు సీక్రెట్ గానే తల్లి కాబోతున్న నయన తార..?

Nayantara

Nayan tara

లేడీ సూపర్ స్టార్ నయనతారఅభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. మొన్నటికి మొన్న విఘ్నేష్ శివం తో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక నిన్నటికి నిన్న టెంపుల్ లో నుదుటున బొట్టు పెట్టుకొని కనిపించి షాక్ ఇచ్చింది. నయన్ ప్రేమ పెళ్లి విషయం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెల్సిందే. నాలుగేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట కరోనా సెకండ్ వేవ్ లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని త్వరలోనే వివాహమాడనున్నారని తెలిసిన విషయమే. ఇక ఇటీవలే ఒక టెంపుల్ లో నయన్ నుదుటిన బొట్టుతో కనిపించడంతో వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఈ జంట ఇప్పటివరకు స్పందించకపోవడంతో వీరి పెళ్లి వార్తలు నిజమే అని అందరు ఫిక్స్ అయిపోయారు.

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం నయన్ గురించి మరో షాకింగ్ వార్త కోలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం నయన్- విఘ్నేష్ జంట తల్లిదండ్రులు కావాలని ఆరాటపడుతున్నారట. అంటే వేరేవిధంగా కాదండీ.. సరోగసీ ద్వారా నయన్ తల్లి కావాలనుకుంటున్నదట. ఇప్పటికే బాలీవుడ్, హాలీవుడ్ లో ఈ పద్దతి సర్వ సాధారణం అయిపోయింది. ఇటీవలే ప్రియాంక- నిక్ దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులుగా మారిన సంగతి తెల్సిందే. ఇక అదే పంథాలో ఈ జంట కూడా పేరెంట్స్ కావాలని ఆశపడుతున్నారట. మరి ఈ వార్తలను అయినా ఈ జంట ఖండిస్తారా..? లేక ఏది నిజమే అని సైలెంట్ గా ఉంటారా..? అనేది చూడాలి.

Exit mobile version