అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య- గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 107 చిత్రం చేస్తున్న విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బాలయ్య అభిమానులను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉండనున్న సంగతి తెలిసిందే.. ఆ స్పెషల్ సాంగ్ లో బాలయ్య తో పాటు కోలీవుడ్ భామ డింపుల్ హయతి డాన్స్ చేస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే అందులో నిజం లేదట.. ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ ఆస్ట్రేలియా బ్యూటీ ని రంగంలోకి దింపినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ సాంగ్ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నది. ఈ సాంగ్ సినిమాకే పెద్ద హైలైట్ గా మారనున్నది టాక్. అందుకే మేకర్స్ కొంచెం కొత్తగా ట్రై చేసి హాట్ బ్యూటీ చంద్రిక రవిని రంగంలోకి దింపారు. అమ్మడి ఘాటు అందాల ప్రదర్శన , బాలయ్య బాబు డిఫరెంట్ స్టెప్స్ తో స్పెషల్ పాట అదిరిపోనున్నదట. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఇప్పటినుంచే ఈ సాంగ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.