Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషికి ఆశ ఉంటుంది, కానీ ఒక ఇల్లు అంటే అదొక జ్ఞాపకం, అదొక అనుబంధం. కోట్లు ఇస్తామన్నా తన జ్ఞాపకాలను అమ్ముకోవడానికి ఇష్టపడని ఒక మొండి మనిషి కథ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’. ఒక వైపు కోట్లు ఇస్తామంటూ భవనాన్ని కూల్చేయడానికి వస్తున్న బిల్డర్, మరోవైపు ఆ డబ్బే సర్వస్వం అనుకుంటూ ఇల్లు వదిలిపోవడానికి సిద్ధపడిన స్నేహితులు, ఇరుగుపొరుగు. కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం తన ఇంటి కోసం ఏకంగా ఆ హౌసింగ్ సొసైటీ మొత్తం మీద ఒంటరి పోరాటానికి దిగుతాడు. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో, బోమన్ ఇరానీ, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించిన ఈ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా నవంబర్ 6 నుండి హిందీ జీ5 (ZEE5) ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఒక మనిషి మొండితనం.. అతడిని సొంతవాళ్లకే దూరం చేస్తుందా? లేక తాను నమ్మిన సిద్ధాంతమే గెలుస్తుందా? అనే పాయింట్‌పై ఈ సినిమాను అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించారు.
ముంబై నగరంలోని ఒక పాత హౌసింగ్ సొసైటీని రీడెవలప్మెంట్ కోసం డెవలపర్ ధర్మేన్ షా (బోమన్ ఇరానీ) కోట్లు కుమ్మరించడానికి వస్తాడు. ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్లంతా ఆ ఆఫర్‌కి టెంప్ట్ అయిపోయి ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకుంటారు. కానీ రిటైర్డ్ ఫిజిక్స్ టీచర్ యోగేశ్ మిశ్రా (మనోజ్ బాజ్‌పాయ్) మాత్రం తన ఇంటిపై ఉన్న మమకారంతో ఆ ఆఫర్‌ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తాడు. దీంతో ఆ సొసైటీలో యోగేశ్ ఒక శత్రువులా మారిపోతాడు. తమ మెరుగైన భవిష్యత్తుకు అతడే అడ్డుగోడలా నిలబడ్డాడని భావించిన సొంత స్నేహితులే అతడిని దూరం పెడతారు. పక్కింటిలో ఉండే సంగీత (దివ్య దత్తా) తన కొడుకు భవిష్యత్తు కోసం ఆ ఆఫర్‌కు ఒప్పుకుని, యోగేశ్‌పై తీవ్రమైన ఆవేశాన్ని ప్రదర్శిస్తుంది. ఒకానొక దశలో సొసైటీలో ఒక్కడిగా మిగిలిపోయిన యోగేశ్ తన ఇంటిని ఎలా కాపాడుకున్నాడు? తన వాళ్లకే ఎందుకు పరాయివాడయ్యాడు? అన్నదే ఈ సినిమా అసలు కథ.
Also Read
అరవింద్ అడిగా రచించిన అత్యంత ఆదరణ పొందిన నవల ఆధారంగా బెన్ రేఖి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి తన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. “యోగేష్ పాత్రలోని మొండితనం, గాఢమైన అనుబంధం నాకు నటుడిగా భిన్నమైన అనుభూతినిచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను తమ సొంత ఇంటి గురించి కచ్చితంగా ఆలోచించేలా చేస్తుంది” అని అన్నారు. “మనిషి ప్రవర్తన, వారి నిర్ణయాలు మంచి-చెడు అనే కోణంలో కాకుండా సహజంగా ఉంటాయని నా పాత్ర ద్వారా ఈ చిత్రంలో చూపించారు” అని దివ్య దత్తా తెలిపారు.
తాజావార్తలు
-
Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
-
Kamal Haasan: కమల్ మాస్ లైనప్.. ఒకేసారి అరడజను సినిమాలు!
-
Imran Khan: ‘నా భార్యను కాపాడండి.. నా కేసు తర్వాత చూద్దాం’ లాయర్లకు ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్!
-
Narakasura Story : దీపావళి వెనుక పురాణ గాథ.. తెల్లవారుజామునే నూనె స్నానం ఇందుకే..!
-
Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..