అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ కొత్త విడుదల తేదీని నిర్ణయించారు. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. నాగ చైతన్య ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో ఇక్కడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవల నాగచౌతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా ఈవెంట్ కి అమీర్ హాజరు కావడంతో ‘లాల్ సింగ్ చద్దా’పై మరింత ఆసక్తి పెంచుకున్నారు తెలుగు ఆడియన్స్. నిజానికి ఈ డిసెంబర్‌లో విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ వచ్చే ఏడాది వాలంటైన్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది.
Read Also : ప్రభాస్ వర్సెస్ అక్షయ్ కుమార్
వచ్చే నెలలో మహారాష్ట్రలో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోనుండటాన్ని యూనిట్ సభ్యలు స్వాగతిస్తున్నారు. అయితే కరోనా కారణంగా పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ఈ క్రిస్మస్ కి ‘లాల్ సింగ్ చద్దా’ను విడుదల చేయలేమంటున్నారు. అయితే రిలీజ్ పోస్ట్ పోన్ చేయటంతో నెటిజన్లు ట్రైలర్ విడుదల చేయమని కోరుతున్నారు. కరీనాకపూర్ ఈ చిత్రంలో హీరోయిన్. ఈ సినిమాను వయాకామ్ సంస్థతో కలసి ఆమీర్ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం.