కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకేక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఎల్2 ఎంపురాన్’ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
Also Read : RaviTeja : నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ రీరిలీజ్ డేట్ ఫిక్స్
భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ సేల్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ. 46 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియా వైడ్ గా రూ.17 కోట్లు ఓవర్సీస్ లో రూ. 29 కోట్లు వసులు చేసింది. నేడు ఈ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం అంది. ఒక అంచనా ప్రకారం చూసుకున్న కూడా ఎంపురాన్ వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్లకు పైగా ఓపెనింగ్ డే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. రిలీజ్ కు ముందే ఈ స్థాయి ఓపెనింగ్ అనేది మలయాళ సినిమాలలో ఆల్ టైమ్ రికార్డ్. మరోవైపు వరుస ప్లాప్స్ ఇస్తున్న మోహన్ లాల్ సినిమాకు ఈ ఓపెనింగ్ అనేది మరో రికార్డ్. ఇలా విడుదలకు ముందే ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఎంపురాన్ రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి.