ఆఫ్ బీట్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. రెగ్యులర్ గా వచ్చే సినిమాలకి పూర్తి భిన్నంగా సడన్ గా ఒక సినిమా ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఊహించని ఆ ఆఫ్ బీట్ సినిమా చూసి ఆడియన్స్ ఫిదా అవుతూ ఉంటారు. అందుకే రెగ్యులర్ జానర్స్ లో వచ్చే సినిమాలని చూసే ప్రేక్షకులు, కొత్త కథతో సినిమా దాని చూడడానికి రిపీట్ మోడ్ లో థియేటర్ కి వెళ్తూ ఉంటారు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘నగరం నిద్రపోతున్న వేళ’, ‘కేరాఫ్ కంచేరపాలెం’ లాంటి సినిమాలు ఈ కోవలోకి వచ్చేవే. ‘అందాధున్’, ‘హైదర్’, ‘దేవ్ D’, ‘ఏ వెడ్నస్ డే’, ‘ఓయ్ లక్కీ, లక్కీ ఓయ్’ లాంటి ఆఫ్ బీట్ సినిమాలు సినిమాలు ఒకప్పుడు బాలీవుడ్ లో కూడా వచ్చేవి కానీ ఈ మధ్య అక్కడి మేకర్స్ మెట్రో కథల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ కారణంగానే ఆడియన్స్ థియేటర్స్ కి దూరం అయ్యారు, ఫలితంగా బాలీవుడ్ కష్టాలలోకి వెళ్లింది. చాలా రోజుల తర్వాత అలాంటి ఆఫ్ బీట్ సినిమానే బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అర్జున్ కపూర్, టబు, కొంకోణ, కుముద్ మిశ్రా, నసీరుద్దిన్ షా, రాధిక మదన్, శార్దుల్ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆ మోడరన్ డ్రామా పేరు ‘కుత్తే’.
ఆస్మాన్ భరద్వాజ్ తెరకెక్కించిన ‘కుత్తే’ మూవీని ‘లవ్ రంజన్’, ‘విశాల్ భరద్వాజ్’, ‘అంకూర్ గార్గ్’ కలిసి ప్రొడ్యూస్ చేశారు. కొన్ని కోట్ల రూపాయలున్న ఒక వ్యాన్ ని ముంబై అవుట్ స్కర్ట్స్ లో కొట్టేయాలని కొందరు ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ ని వాళ్లు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనేదే ‘కుత్తే’ కథ. కలిసి ప్లాన్ ని పూర్తి చేయాల్సిన ఏడు మంది ఏం చేశారు అనే ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ తో ‘కుత్తే’ ట్రైలర్ ని కట్ చేసి రిలీజ్ చేశారు. హిలేరియస్ ఫన్ తో, సూపర్బ్ డైలాగ్స్ తో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఇలాంటి ఇంటరెస్టింగ్ ట్రైలర్ కట్ బయటకి రాలేదు. విశాల్ భరద్వాజ్ రాసిన డైలాగ్స్ ట్రైలర్ లో బాగా పేలాయి, ముఖ్యంగా ‘టబు’ చెప్పిన ‘దేవుడు మగవాళ్లని తాయారు చెయ్యడం మానేసాడు’ అనే డైలాగ్ సూపర్ గా వర్కౌట్ అయ్యింది. ట్రైలర్ తో మెప్పించిన ‘కుత్తే’ చిత్ర యూనిట్ ఫుల్ మూవీతో ఎంతవరకు మెప్పిస్తారు అనేది తెలియాలి అంటే జనవరి 13 వరకూ ఆగాల్సిందే.